Breaking News

నాడు అర్హులు.. నేడు అనర్హులట!

Published on Sun, 01/19/2025 - 05:37

అనంతపురం : పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులపట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్దయతో వ్యవహరిస్తోంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన పలువురిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించకుండా తీరని అన్యాయం చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్‌ నాటికి వారు వయసు రీత్యా అర్హులే. కానీ.. కోర్టు కేసు, ఎన్నికల కారణంగా గతంలో దేహదారుఢ్య పరీక్షలు ఆగిపోయాయి. ఎన్నికల అనంతరం« అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే ఈవెంట్స్‌ పెట్టి, నియామకాలు చేపట్టకుండా ఐదు నెలలపాటు కాలయాపన చేసింది. ఇప్పుడు వయసు మీరిపోయిందంటూ అనేకమందిని ఇళ్లకు పంపేస్తోంది.

వారు అర్హులైనప్పటికీ, వారి తప్పేమీ లేకపోయినప్పటికీ నిర్దయగా తిరస్కరిస్తోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదేమిటని సెలక్షన్‌ అధికారులను అడిగితే.. తామేమీ చేయలేమని, ఏదైనా ఉంటే రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు విన్నవించుకోవాలని సూచిస్తున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్‌ఐ, 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఎస్‌ఐ పోస్టులకు ప్రిలిమ్స్, దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. కానిస్టేబుల్‌ పోస్టులకు 2023 జనవరి 22న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. తమ సర్వీసును సైతం పరిగణనలోకి తీసుకోవాలని హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈవెంట్స్‌ (దేహదారుఢ్య పరీక్షలు) బ్రేక్‌పడింది. అనంతరం సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

అనంతరం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  ఐదునెలల పాటు ఈ పోస్టుల భర్తీని పట్టించుకోలేదు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులంతా మళ్లీ ఆన్‌లైన్‌లో ఈవెంట్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని రెండునెలల క్రితం ప్రకటించింది. అప్పట్నుంచి కష్టపడి దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమైన పలువురు అభ్యర్థులను వయసు మీరిందంటూ అనుమతించకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

అన్యాయమైన నిర్ణయం
దేహదారుఢ్య పరీక్షలు జనవరి 17న నిర్వహిస్తున్నట్లు హాల్‌టికెట్‌ ఇచ్చారు. అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియానికి వెళ్లాక.. ‘మీకు వయసు అయిపోయింది. అర్హతలేద’ని చెప్పారు. నోటిఫికేషన్‌ జారీ సమయానికి వయసును పరిగణనలోకి తీసుకోవాలిగానీ అందుకు విరుద్ధంగా తీసుకుంటున్నారు. ఈ పరీక్షలకు నెలన్నర నుంచి సిద్ధమయ్యాను. తీరా ఇప్పుడు అర్హతలేదనడంతో కానిస్టేబుల్‌ కల చెదిరిపోతోంది. నాలాగ ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే  100 మంది వరకు అన్యాయానికి గురయ్యారు. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మా విన్నపాన్ని పరిగణన­లోకి తీసుకుని న్యాయం చేయాలి. – ఎన్‌. చంద్రశేఖర్, కానిస్టేబుల్‌ అభ్యర్థి, అనంతపురం

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)