Breaking News

ఎయి‘డెడ్‌’ స్కూళ్లు!

Published on Tue, 10/07/2025 - 05:53

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్‌ స్కూళ్ల విలీనం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నందున ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేయబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 763 ఎయిడ్‌ స్కూళ్లు ఉండగా.. 40 కంటే తక్కువ విద్యార్థుల నమోదు ఉన్న 251 స్కూళ్ల కరస్పాండెంట్లకు నోటీసులు జారీ చేయాలని డీఈవోలను పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. ఇటీవల ఇదే తరహాలో విజయనగరం జిల్లాలోని ఏడు స్కూళ్లను విద్యా శాఖలో విలీనం చేసింది. ఇప్పుడు మరో 251 స్కూళ్లకు నోటీసులు ఇవ్వబోతోంది. ఇప్పటికే ఈ స్కూళ్ల యాజమాన్యాలకు రెండుసార్లు నోటీసులు ఇచి్చనట్లు విద్యా శాఖ వర్గాలు తెలిపాయి.

తుది నోటీసులు ఇచ్చి.. ఈ స్కూళ్లను సిబ్బందితో సహా విద్యా శాఖలో విలీనం చేయనున్నట్లు వెల్లడించాయి. నోటీసులో పేర్కొన్నా జాబితాలో అనకాపల్లి జిల్లాలో 2, అనంతపురంలో 8, అన్నమయ్యలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12, బాపట్లలో 26, చిత్తూరులో 4, తూర్పు గోదావరిలో 10, ఏలూరులో 8, గుంటూరులో 29, వైఎస్సార్‌ కడపలో 18, కాకినాడలో 5, అంబేడ్కర్‌ కోనసీమలో 2, కృష్ణాలో 13, కర్నూలులో 2, మన్యంలో 5, నంద్యాలలో 8, నెల్లూరులో 6, ఎన్టీఆర్‌ జిల్లాలో 12, పల్నాడులో 17, ప్రకాశంలో 35, తిరుపతిలో 6, విశాఖపట్నంలో 3, విజయనగరంలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 ఎయిడెడ్‌ స్కూళ్లు ఉన్నాయి. 

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విలీన ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారులను డైరెక్టరేట్‌ ఆదేశించింది. ఈ స్కూళ్ల విలీనం పూర్తయితే దాదాపు 900 నుంచి 1,000 మంది ఉపాధ్యాయులు.. అంతే సంఖ్యలో బోధనేతర సిబ్బంది కూడా విద్యా శాఖలో విలీనమయ్యే అవకాశం ఉంది.  

వారిని అదే మండలంలో నియమించాలి 
స్కూళ్ల విలీనం అనంతరం మిగులుగా తేలిన ఎయిడెడ్‌ ఉపాధ్యాయులను అదే మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో నియమించాలని ఏపీటీఎఫ్‌ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ కోరారు. కాగా, రాష్ట్రంలోని ఎయిడెడ్‌ స్కూళ్లలో పనిచేస్తున్న 3 వేల మంది ఉపాధ్యాయులకు సెపె్టంబర్‌ నెల వేతనం ఇంకా జమ చేయలేదని.. వెంటనే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ గిల్డ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు, ఎల్‌కే చిన్నప్ప, ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.   

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)