Breaking News

నేతన్నకు ఉచిత విద్యుత్‌పై ఉత్తుత్తి లెక్కలు..!

Published on Fri, 08/08/2025 - 06:00

సాక్షి, అమరావతి: నేతన్నలకు ఉచిత విద్యుత్‌ అమలుపై కూటమి సర్కారు ఏపాటి చిత్తశుద్ధితో ఉందో ప్రభుత్వ పెద్దల ప్రకటనలే అద్దం పడుతున్నా­యనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 1న మంత్రి సవిత విడుదల చేసిన ప్రకటనకు తాజాగా గురువారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన లెక్కలకు పొంతన లేకపోవడం గ­మనార్హం. లబ్ధిదారుల సంఖ్యపై పరస్పర విరుద్ధంగా లెక్కలు చెప్పడంతో నేతన్నలు నివ్వెరపోతు­న్నారు.

ముఖ్యమంత్రి ఇలా అన్నారు..
మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్‌ పథకం ద్వారా రాష్ట్రంలో చేనేత మగ్గాలున్న 93 వేల కుటుంబాలకు, పవర్‌ లూమ్స్‌ ఉన్న 50 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దీనికోసం ప్రభుత్వం ఏడాదికి రూ.190 కోట్లు ఖర్చు చేస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికులు ఆధారపడి జీవిస్తున్న చేనేత రంగంలో దాదాపు 1,22,644 కుటుంబాలు ఉన్నాయన్నారు.

2014–19లో 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చామని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు మగ్గాలున్న 93 వేల కుటుంబాలకు 200 యూనిట్లు, మర మగ్గాలున్న 50 వేల కుటుంబాలకు 500 యూనిట్లు (ఈ లెక్కన మొత్తం 1.43 లక్షల కుటుంబాలు) ఉచిత విద్యుత్‌ అని ప్రకటించడం గమనార్హం. 

ప్రభుత్వ ప్రకటనలో ఇలా..
రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధికులు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, 2.50 లక్షల మంది చేనేత వస్త్రాల తయారీనే జీవనాధారంగా చేసుకున్నారని బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. మగ్గాలపై నేసే నేతన్నలకు ఏడాదికి రూ.14,956, మర మగ్గాలపై ఆధారపడిన వారికి రూ.32,604 మేర లబ్ధి కలగనుందని ప్రకటించింది. ఈ లెక్కన మొత్తం రూ.300 కోట్లుపైనే అవుతుంది.

మంత్రి ప్రకటన మరోలా..
రాష్ట్రంలో 65 వేల చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ రూపంలో రూ.125 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత ఈ నెల 1న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 50 వేల మగ్గాలు, 11,500 మర మగ్గాలపై ఆధారపడి జీవి­స్తున్నట్లు తెలిపారు. ఈ లెక్కన చూస్తే 61,500 మంది మాత్రమే అవుతారు. లబ్ధిదారుల సంఖ్య, ప్రయోజనం మొత్తంపై ముఖ్యమంత్రి నుంచి మంత్రి వరకు గందరగోళంగా వ్యవహరిస్తుంటే పథకం ఏ మేరకు చిత్తశుద్ధితో అమలవుతుందో ప్రభుత్వానికే ఎరుక!! 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)