Breaking News

రద్దు దిశగా ఆప్కాస్‌!

Published on Tue, 04/29/2025 - 05:27

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఔట్‌సోగ్‌ ఉద్యోగుల జీవితాలతో మళ్లీ ఆటలు మొదలుపెట్టింది. చిరుద్యోగుల పొట్టకొట్టి అస్మదీయులకు చెందిన ప్రైవేటు ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఔట్‌సోగ్‌ విధానాన్ని సమీక్షించేందుకంటూ ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సోర్స్‌డ్‌ సర్వీసెస్‌(ఆప్కాస్‌)ను రద్దు చేసి.. మళ్లీ ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగిస్తే తమ జీవితాలు రోడ్డున పడతాయని చిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 

ఆప్కాస్‌తో చిరుద్యోగులకు భద్రత..
గతంలో చంద్రబాబు హయాం(2014–19)లో ప్రైవేటు ఏజెన్సీలు, దళారుల చేతుల్లో చిరుద్యోగుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఔట్‌సోగ్‌ ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వకుండా ప్రైవేట్‌ ఏజెన్సీలు వేధించేవి. ఐదు శాతానికి పైగా కమీషన్లు తీసుకోవడంతో పాటు ఇష్టానుసారంగా ఉద్యోగులను తొలగించేవి. అనంతరం ఏర్పడిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఔట్‌సోగ్‌ ఉద్యోగుల నియామకాలు, జీతాల చెల్లింపుల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు.. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఆప్కాస్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారానే ఔట్‌సోగ్‌ ఉద్యోగుల నియామకాలు జరిగేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తద్వారా ప్రైవేట్‌ ఏజెన్సీల వేధింపులు, కమీషన్ల నుంచి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు విముక్తి కల్పించింది. దీని ద్వారా లక్ష మంది ఔట్‌ సోగ్‌ ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తుండగా..లంచాలు అనే ప్రసక్తే లేకుండా ఠంచన్‌గా ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు అందేవి. ఈపీఎఫ్,ఈఎస్‌ఐ వంటివి కూడా ప్రతి నెలా సక్రమంగా జమ అయ్యేవి. 

విరమించుకోకపోతే.. ఉద్యమిస్తాం
తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఔట్‌సోగ్‌ ఉద్యోగులపై కక్ష కట్టింది. ఆప్కాస్‌ను రద్దు చేసి.. తమ ఏజెన్సీల ద్వారా ఔట్‌సోగ్‌ ఉద్యోగులను నియమించుకునే ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగానే మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిందని చిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తద్వారా ప్రైవేటు ఏజెన్సీలతో పాటు తమ జేబులు కూడా నింపుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏపీఐఐసీ, మారిటైమ్‌ బోర్డులలో పనిచేస్తున్న చిరుద్యోగులను తొలిగించిందని.. ఇప్పుడు ఆప్కాస్‌ రద్దు ద్వారా తమ పొట్టకొట్టేందుకు సిద్ధమైందని వాపోతున్నారు. ఈ ఆలోచనను విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామక వ్యవస్థపై సమీక్ష
మంత్రుల బృందం ఏర్పాటు
సాక్షి, అమరావతి: ఔట్‌సోగ్‌ సిబ్బంది నియామక ప్రస్తుత వ్యవస్థను సమీక్షించడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు. మంత్రులు నారాయణ, నారా లోకేశ్, పయ్యావుల కేశవ్‌లతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రుల బృందం కార్యకలాపాలను సమన్వయం చేయడానికి సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్‌) ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ బృందం సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఆర్థిక శాఖ (హెచ్‌ఆర్‌) కార్యదర్శి హాజరవుతారు. మంత్రుల బృందం విధి విధానాలు ఇలా ఉన్నాయి..

⇒ ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తోన్న ఔట్‌సోగ్‌ సిబ్బంది సంఖ్య ప్రస్తుత స్థితిని సమీక్షించాలి.
⇒ ఔట్‌సోగ్‌ సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రస్తుత మెకానిజంను సమీక్షించాలి.
⇒ వ్యవస్థలోని లోపాలు, ఫిర్యాదులను పరిశీలించాలి.

⇒ ఇందుకోసం ఔట్‌సోగ్‌ సిబ్బందితో సంప్రదింపులు జరపాలి.
⇒ ప్రస్తుత వ్యవస్థ కంటే మరింత జవాబుదారీగా, సమర్థవంతంగా, పారదర్శకంగా ఔట్‌సోగ్‌ సిబ్బంది సంక్షేమాన్ని పెంపొందించడానికి చర్యలను సూచించాలి.
⇒ ఈ విషయంలో సముచితమని భావించే ఏదైనా ఇతర అంశాన్ని మంత్రుల బృందం పరిగణించవచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)