Breaking News

ఉపాధికి ‘బర్డ్‌ ఫ్లూ’ దెబ్బ!

Published on Sun, 02/16/2025 - 04:34

సాక్షి, అమరావతి: ‘బర్డ్‌ఫ్లూ’ వ్యాధి పౌల్ట్రీ కార్మి­కుల ఉపాధిని దెబ్బతీస్తోంది. వేలాది  కార్మికుల కుటుంబాలు జీవనోపాధిలేక రోడ్డున పడ్డాయి. ఈ వ్యాధి ప్రభావంతో లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడడంతో పెద్ద సంఖ్యలో పౌల్ట్రీ ఫారాలు మూతపడే పరిస్థితి ఏర్పడింది.  

ఐదు జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ ప్రభావం.. 
రాష్ట్రంలో 1,200కు పైగా పౌల్ట్రీ ఫామ్స్‌ ఉన్నాయి. ఇందులో వెయ్యికి పైగా ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనే ఉన్నాయి. వీటిల్లో 5.60 కోట్ల కోళ్లున్నాయి. ప్రతిరోజూ 4.75 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. ప్రతి ఫామ్‌లోనూ 10–25 మంది ఉపాధి పొందుతుంటారు. వీరంతా ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారే. వీరు ఫామ్స్‌ వద్దే ఉంటూ వాటి  నిర్వహణను చూసుకుంటుంటారు. 

పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, ఏలూరు జిల్లా బాదంపూడి, ఎన్జీఆర్‌ జిల్లా గంపలగూడెంతో పాటు కర్నూలు జిల్లా ఎన్‌ఆర్‌ పేటలలో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ సోకి లక్షలాది కోళ్లు, బాతులు మృత్యువాతపడ్డాయి. ఈ ఐదు గ్రామాల్లోని కోళ్ల ఫారా­ల పరిధిలో కిలోమీటరు ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా.. 10 కి.మీ. వరకు అలెర్ట్‌ జోన్‌గా ప్రకటించారు. 

రెడ్‌జోన్‌ పరిధిలో సుమారు 30కి పైగా ఫామ్స్‌ మూసివేసి వాటిలో ఉండే సుమారు ఆరున్నర లక్షలకు పైగా కోళ్లను చంపి పాతిపెట్టేశారు. లక్షల సంఖ్యలో కోడిగుడ్లను కూడా ధ్వంసం చేశారు. పది కిలోమీటర్ల పరిధిలో కూడా పదుల సంఖ్యలో కోళ్ల ఫారాలను మూసివేశా­రు. అలాగే, సరై్వలెన్స్‌ జోన్‌ పెట్టి 24 గంటలూ వాటిల్లోని కోళ్ల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షిస్తున్నారు. 

వివక్షకు గురవుతున్న కార్మికులు.. 
ఇక బర్డ్‌ ఫ్లూ ప్రభావం రెడ్, అలెర్ట్‌ జోన్‌ పరిధిలోని సుమారు 10–15 వేల మంది కార్మికులపై తీవ్ర ప్రభా­వం చూపుతోంది. రెడ్‌ జోన్‌లో ఉన్న పౌల్ట్రీ ఫామ్స్‌­లో పనిచేసే కార్మికుల రక్తనమూనాలు సేకరిస్తుండడంతో చుట్టుపక్కల ప్రజలు వారిని దూరంపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. వీరిలో ఏ ఒక్కరికీ వైరస్‌ లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించినప్పటికీ  వివక్షకు గురవుతున్నారు.  

అ­ద్దె ఇళ్లల్లో ఉంటున్న వారిని ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోవాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో.. చేసేదిలేక కొందరు బంధువుల ఇళ్లకు వెళ్లిపోతుండగా, పొరుగు జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి­న వారు స్వస్థలాలకు తిరుగుముఖం పడుతున్నారు.



ప్రోత్సాహమివ్వని ఏపీ సర్కారు..
ఇదిలా ఉంటే.. బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వెలుగుచూసిన జిల్లాల్లో రెడ్, అలెర్ట్‌ జోన్‌ పరిధిలోని పౌల్ట్రీ ఫారాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కార్మి­కు­ల్లేక వెలవెలబోతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో.. మేత ధరలు అమాంతం పెరిగిపోవడంతో అవి 75 శాతం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయి. మరోపక్క..  ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఏపీ నుంచి వచ్చే గుడ్డుకు ధరలేకుండా చేస్తున్నారు. 

యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కోళ్ల ఫారాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుండగా ఏపీలో మాత్రం ప్రభుత్వం తీరు పౌల్ట్రీ పరిశ్రమకు శాపంగా తయారైంది. దీంతో రాష్ట్రంలో ఈ రంగం మరింత కుదేలవుతుంది. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)