Breaking News

కొండలు పిండి.. సొమ్ములు దండి..

Published on Mon, 08/12/2024 - 05:58

సాక్షి ప్రతినిధి, బాపట్ల: అధికారపార్టీ నేతలు బరితెగించారు. ఇసుక, మట్టి, గ్రావెల్, గ్రానైట్, రేషన్‌ అనే తేడా లేకుండా ఏది దొరికినా.. కొల్లగొట్టి జేబులు నింపుకొంటున్నారు. అక్రమార్జనకు కాదేదీ అనర్హం అనే రీతిలో తెగబడుతున్నారు. ఇందులో పర్చూరు ముఖ్యనేతది ప్రత్యేక స్థానం. నియోజకవర్గంలో ఉన్న ప్రకృతి వనరులను ఎలా దోచుకుతినాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనుకోవాలి. పర్చూరులో ఉన్న ఇసుక, గ్రానైట్, గ్రావెల్‌లను అక్రమంగా తరలించి కోట్లు కొల్లగొడుతున్నారు. 

ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండికొట్టి సొంత లాభం చూసుకుంటున్నారు. ఇప్పటికే ఇసుక, పాలిషింగ్‌ గ్రానైట్‌ అక్రమ రవాణాలో జోరుపెంచిన పర్చూరు నేత అంతేస్థాయిలో గ్రావెల్‌ అక్రమ తరలింపు చేపట్టారు. మార్టూరు మండలంలోని అటవీ భూముల నుంచి గ్రావెల్‌ అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం పచ్చని కొండల్ని పిండిచేస్తున్నారు. జేసీబీలు, ఇటాచ్‌లు పెట్టి గ్రావెల్‌ అక్రమంగా తరలించి రియల్‌ వెంచర్లు, రోడ్ల నిర్మాణాలకు అమ్ముకుంటున్నారు.

వంద టిప్పర్లు, వందకుపైగా ట్రాక్టర్లతో..
మార్టూరు మండలంలోని మార్టూరు, ఇసుకదర్శి ప్రాంతాల్లోని అటవీ భూములనుంచి గ్రావెల్‌ను టీడీపీ ముఖ్యనేత రేయింబవళ్లు అక్రమంగా తరలిస్తున్నారు. కొండల్లో జేసీబీ, ఇటాచ్‌ మిషన్లు పెట్టి తవ్విపోస్తున్నారు. ఇక్కడినుంచి రోజూ వంద టిప్పర్లు, వందకుపైగా ట్రాక్టర్లతో గ్రావెల్‌ అక్రమంగా రవాణా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న రియల్‌ వెంచర్లతోపాటు బాపట్ల, చీరాల ప్రాంతాల్లోని రియల్‌ వెంచర్లకు గ్రావెల్‌ ఇక్కడినుంచే సరఫరా అవుతోంది. ఓడరేవు–నరసరావుపేట జాతీయ­రహదారి పనులకూ ఈ గ్రావెల్‌ అమ్ముతున్నారు. 

సదరు కాంట్రాక్టర్‌ మరొకరి వద్ద గ్రావెల్‌ కొనకుండా పర్చూరు ముఖ్యనేత ఒత్తిడి తెచ్చి తానే సరఫరా చేస్తున్నారు. ఒక్క రోడ్డుపనికే రోజుకు వందలాది ట్రిప్పుల గ్రావెల్‌తోపాటు ట్రాక్టర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా అవసరమైనవారికి పంపించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా టిప్పర్‌ గ్రావెల్‌ రూ.8 వేలకు, ట్రాక్టర్‌ గ్రావెల్‌ రూ.2 వేలకు విక్రయిస్తున్నారు. దూరాన్ని బట్టి రేటు పెరుగుతుంది. ఈ అక్రమ దందాను పర్చూరు అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుడైన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుయువత నేత నడిపిస్తున్నాడు. 

కూటమి రాకతో లీజుల రద్దు
గత ప్రభుత్వంలో పర్చూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం గ్రావెల్‌ కోసం లీజులు మంజూరుచేసింది. మార్టూరు మండలం బొబ్బేపల్లి, కోలలపూడి, వలపర్ల, బొల్లాపల్లి ప్రాంతాల్లో పదులసంఖ్యలో లీజులుండేవి. ఆ లీజు భూముల నుంచి గ్రావెల్‌ తరలించి విక్రయించేవారు. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వచ్చేది. తద్వారా జిల్లాకు, మైనింగ్‌ పరిధిలోని గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరేవి. వాటితో అభివృద్ధి పనులు చేపట్టేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పర్చూరు ముఖ్యనేత గతంలో ఉన్న బొబ్బేపల్లి పరిధిలోని లీజులను రద్దు చేయించారు.

కోలలపూడి, వలపర్ల, బొల్లాపల్లి ప్రాంతాల లీజులను రద్దుచేయకపోయినా అధికారం అడ్డుపెట్టి అక్కడ మైనింగ్‌ జరగకుండా నిలిపే­యించారు. తాను మాత్రం లీజు, అనుమతులు వంటివి లేకుండానే ఇసుకదర్శి, ద్రోణాదుల తదితర అటవీప్రాంతాల నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తరలించి కోట్లు కొల్లగొడుతున్నారు. పర్చూరు నేత అక్రమ గ్రావెల్‌ దందాతో ప్రభుత్వ రాబడికి రూ.కోట్ల మేర గండిపడుతోంది. గ్రావెల్‌ దందా, ప్రభుత్వాదాయానికి గండి గురించి తెలిసినా సంబంధిత శాఖల అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)