Breaking News

భట్టిప్రోలులో టీడీపీ బరితెగింపు

Published on Sun, 08/04/2024 - 05:51

భట్టిప్రోలు: టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ఒకవైపు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. మరోవైపు తమ ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులపైనా దౌర్జన్యానికి దిగుతున్నారు. పోలీసు అధికారులపై సైతం దౌర్జన్యం చేస్తున్నారు. తాము చెప్పినట్లు వినకుంటే మీ సంగతి తేలుస్తామంటూ బెదిరిస్తున్నారు. 

తాజాగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో శనివారం టీడీపీ కార్యకర్త ఆదిన తాండవకృష్ణ అనే వ్యక్తి నగరం ఎస్‌ఐ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని నెట్టివేయడం, దుర్భాషలాడటం ఇందుకు నిదర్శనం. టీడీపీ కార్యకర్త ఏకంగా ఎస్‌ఐ చొక్కాపట్టుకుని నెట్టివేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

విన్నవించినా వినకుండా ఎస్‌ఐపై దౌర్జన్యం
వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు, భట్టిప్రోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబాలు నియోజకవర్గంలో పేకాట, కోడిపందాల నిర్వహణపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ విషయంపై శనివారం బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్‌ చేసుకున్నారు. దీంతో పోలీసులు భట్టిప్రోలులో సెక్షన్‌ 30 అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరు నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. 

భట్టిప్రోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా సాయంత్రం 4 గంటల సమయంలో బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆయనను వారించి తమకు సహకరించాలని కోరారు. అయినా సాయిబాబా పట్టించుకోకుండా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయనను అడ్డకున్నారు. దీంతో సాయిబాబా అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

ఈ క్రమంలో సాయిబాబా అనుచరులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో టీడీపీ కార్యకర్త ఆదిన తాండవకృష్ణ అనే వ్యక్తి నగరం ఎస్‌ఐ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని నెట్టారు. అధికార పార్టీ కార్యకర్త కావడంతో ఎస్‌ఐ ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో కొద్ది నిమిషాల్లోనే బయటకు రావడం... అది చూసిన పలువురు రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకుండాపోయిందని, సామాన్యుల పరిస్థితి ఏమిటోనని ఆందోళన వ్యక్తంచేశారు.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)