Breaking News

కూటమి నేతల హల్‌చల్‌.. కోడి పందెం, రికార్డింగ్‌ డ్యాన్స్‌..

Published on Wed, 01/15/2025 - 10:38

సాక్షి, కాకినాడ: ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడో రోజు యథేచ్ఛగా కోడి పందేలు(Kodi Pandem) కొనసాగుతున్నాయి. సంక్రాంతి సంబరాల పేరిట కూటమి నేతలు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే సమయంలో పాఠశాలలను సైతం టీడీపీ నేతలు వదలడం లేదు. స్కూల్స్‌లో కూడా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో, స్థానికులు మండిపడుతున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. కూటమి నేతలే దగ్గరుండి అన్ని కార్యక్రమాలను చూసుకుంటున్నారు. అలాగే, కోడి పందేల బరుల దగ్గర జూదం కోసం స్పెషల్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అడ్డు అదుపు లేకుండా గుండాట, పేకాట, గ్యాంబ్లింగ్‌, లోనాబయటా ఆడిపిస్తున్నారు. ఇక, జూద క్రీడలు కూటమి నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. పేకాట ఆడేవాళ్లకు దగ్గరుండి మద్యం సరఫరా చేయిస్తున్నారు కూటమి నేతలు.

ఇదే సమయంలో కోడి పందేలా కోసం ప్రభుత్వ పాఠశాలలను సైతం కూటమి నేతలు వదిలిపెట్టడం లేదు. తుని రూరల్ వి.కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో కోడి పందేలు, జూదాలు నిర్వహించారు. ఇక, కూటమి నేతల ఒత్తిళ్ళతో కోడి పందేల వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎక్కడ చూసినా జూదం ఆడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి టీడీపీ, జనసేన నేతలు కోడి పందేలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. కోడి పందేల బరుల వద్ద బెట్టింగ్‌ల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. జూద క్రీడలు, కోడి పందేల కోసం లక్షల్లో బెట్టింగ్‌ కాస్తున్నారు.

ఇదిలా ఉండగా.. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు జనసేనలో కోడి పందేలు చిచ్చురేపాయి. రాజోలులో నడి రోడ్డుపై కోడి పందెం బరుల కోసం జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్‌పై టీడీపీ, జనసేన నాయకులు ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే మాటలను బేఖాతరు  చేస్తూ ఇష్టారీతిన బరులు ఏర్పాటు చేసుకున్నారు జనసేన, టీడీపీ నాయకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజోలులో విచ్చలవిడిగా కోడి పందేలు, గుండాట, రికార్డింగ్‌ డ్యాన్స్‌లు జరిగాయి. పలుచోట్ల రాత్రి సమయంలో కూటమి నేతలే రికార్డింగ్‌ డ్యాన్స్‌లను ప్రోత్సహించారు. 

ఇంతటితో ఆగకుండా కూటమి నేతలు మరింత హల్‌చల్‌ చేశారు. ఇటీవలి కాలంలో బౌన్సర్లు ఏర్పాటు సాధారణంగా మారిన నేపథ్యంలో కోడి పందేల బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఓ అడుగు ముందుకేసిన నిర్వాహకులు మహిళా బౌన్సర్లను రంగంలోకి దింపారు. 

కోడిపందాలో లేడీ బౌన్సర్..!

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)