టీడీపీ నేతల వేధింపులకు పల్నాడు ఉద్యోగి బలి

Published on Sat, 08/17/2024 - 18:59

సాక్షి, పల్నాడు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులతో రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ఉద్యోగులను ఎవరినీ వదలకుండా వేధింపులకు తెగపడుతున్నారు. తాజాగా పచ్చ నేతల వేధింపులకు పల్నాడులో ఓ ఉద్యోగి బలి అయ్యారు. పల్నాడు జిల్లాలోని అన్నారం సొసైటీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని టీడీపీ సానుభూతిపరులు దొప్పలపూడి శ్రీనివాసరావు, సురేంద్రబాబులు వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 

అధికారులు సైతం శ్రీనివాస్ రెడ్డికి రెండు నెలల నుంచి జీతం ఆపేశారు. ఉద్యోగం మానేయాలని ఆ ఉద్యోగంలో తమ వారిని ఎంపిక చేసుకుంటామని ఆయన్ను టీడీపీ నేతలు వేధించారు. వారి వేధింపులు భరించలేక శ్రీనివాస్ రెడ్డి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆయన్ను నరసరావుపేట ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. శ్రీనివాస్‌రెడ్డి మృతికి టీడీపీ నేతల వేధింపులు కారణమని  కుటుంసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)