Breaking News

కూటమి పాలనలో అప్పుల జాతర.. సంక్షేమానికి పాతర

Published on Fri, 11/15/2024 - 05:16

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఐదు నెలల పాలన ‘అప్పుల జాతర–సంక్షేమానికి పాతర‘ అన్నట్లుగా ఉందని వైఎస్సార్‌సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని చెప్పారు. ప్రశ్నించిన వారిని అక్రమంగా నిర్బంధించడం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదు నెలల్లో రూ.57వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌ సిక్స్‌ హామీలను కూడా గాలికొదిలేసిందని చెప్పారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధికి అసలు కేటాయింపులే చేయలేదని వివరించారు. తల్లికి వందనం పథకానికి రూ.12,600 కోట్లు కావాల్సి ఉండగా, బడ్జెట్‌లో కేవలం రూ.5,380 కోట్లు కేటాయించడం చూస్తే లబ్ధిదారుల్లో సగం మందికి కోత పడే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. 

ఉచిత సిలిండర్‌ పథకానికి రూ.850 కోట్లు, రైతులకు పెట్టుబడి సాయం కోసం కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఐదు నెలల్లో ఆడబిడ్డలపై జరిగిన ఘోరాలకు సంబంధించి 7,393 కేసులు నమోదయ్యాయని, అంటే రోజుకు సగటున 48 ఘటనలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. నేరాలను అదుపు చేయలేని ఈ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని, వెంటనే సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)