Breaking News

ఏపీ వైద్య శాఖ విధానాలపై తమిళనాడు ఆసక్తి

Published on Wed, 07/26/2023 - 04:31

సాక్షి, అమరావతి: ‘కార్పొరేట్‌’కు ధీటుగా రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే ల క్ష్యంగా అడుగులు వేస్తున్న సీఎం జగన్‌ ప్రభుత్వం వైద్యశాఖలో అనేక రకాల సంస్కరణలను చేపట్టి ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ అమలు­చేస్తున్న  కార్యక్రమాలు పలు రాష్ట్రాలకు మోడల్‌గా నిలుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి  అధికారులు ఇక్కడి కొచ్చి ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను అధ్య యనం చేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో మహారాష్ట్ర వైద్య బృందం రాష్ట్రానికి వచ్చి మన కార్యక్రమాలపై అధ్యయనం చేసి, ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ అమలును ప్రశంసించారు.

ఇప్పుడు తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఏపీ విధానాలపై ఆసక్తి కనబరుస్తోంది. దేశంలోనే ఎక్కడాలేని రీతిలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కార్యక్ర­మాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ తరహా కార్యక్రమాన్ని తమిళనాడు­లోనూ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేప థ్యంలో.. తమిళనాడు హెల్త్‌ సిస్టమ్స్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఐఏఎస్‌ అధికారి ఎం. గోవిందరావు సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించారు.

గుంటూరు జిల్లా జంగంగుంట్లపాలెం గ్రామం­లోని డాక్టర్‌ వైఎ స్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ను సందర్శించారు. ఈ గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలు, హెల్త్‌ క్లినిక్‌ సేవలను పరిశీలించారు. పేపర్‌ రహిత వైద్యసేవల కల్పనకు అవలంబిస్తున్న విధానాలను తెలుసుకు న్నా రు. విజయవాడ జీజీహెచ్, మంగళగిరి ఇందిరా నగర్‌ వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ (ఏబీడీఎం) అమలును పరిశీలించారు. 

ప్రజల వద్దకే డాక్టర్‌ వెళ్లడం బాగుంది
తన పర్యటనలో ఏపీలోని ఆరోగ్య కార్యక్రమాల పరిశీలన అనుభవాలను గోవిందరావు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఏపీలో ఫ్యామిలీ డాక్టర్‌ అమలు విధానం చాలా బాగుందన్నారు. నెలలో రెండుసార్లు పీహెచ్‌సీ వైద్యులు గ్రామాల్లో ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందించడం మంచి పరి­ణామమన్నారు.

గామస్థాయిలో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా 12 రకాల వైద్యసేవలు, 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు అందుబా­టులో ఉం­చడం ప్రజలకు ఎంతో ప్రయోజనక­రమని కితాబిచ్చారు. మరోవైపు.. ఏబీడీఎం అమ ల్లో భాగంగా ఇక్కడి వైద్యశాఖ అనుసరి­స్తున్న విధా నాలనూ తెలుసుకున్నామ­న్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ తరహా కార్యక్రమం అమ­లుకు తమిళనాడు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని వివరించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)