Breaking News

తిరుమలలో మరో అపచారం.. భద్రత డొల్లతనం?

Published on Sat, 01/18/2025 - 11:50

సాక్షి, తిరుపతి: తిరుమలలో భద్రతా డొల్లతనం మరోసారి బయటపడింది. అధికారులను దాటుకుని మాంసాహారం ఆలయానికి సమీపంలోకి చేరింది.  రాంభగీచా బస్టాండు వద్ద గుడ్డు భోజనం తింటూ కొందరు పట్టుబడ్డారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 

తిరుమలలో మాంసాహారం నిషేధం. కొందరు భక్తులు సమాచారం ఇవ్వడంతో తమిళనాడు భక్తులను టీటీడీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది బృందంగా వచ్చిన భక్తులను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు.

నిషేధిత తిను బండరాలతో తమిళనాడు భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఓ డబ్బా నిండా కోడి గుడ్లు, పలావ్ తో అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు. సెక్యూరిటీ తనిఖీ దాటుకొని వచ్చిన తమిళనాడు భక్త బృందం.. రాంభాగిచ్చ బస్టాండ్ ఆవరణలో కోడిగుడ్డు, పలావ్ తింటున్నట్లు కొందరు భక్తులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానం

భక్తుల ఫిర్యాదుతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టరాదని ఆ బృందాన్ని మందలించారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో డొల్లతనాన్ని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. తనిఖీ కేంద్రం దాటుకొని నిషేధిత ఆహారం ఎలా తిరుమలకు వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హిందూత్వ సంఘాలు, స్వామీజీలు నిరసన
అలిపిరి జూపార్క్ రోడ్డులో ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీటీడీ పరిపాలన భవనం ఎదుట హిందూత్వ సంఘాలు, స్వామీజీలు నిరసన చేపట్టారు. ఏడు కొండలకు వెన్ను పోటు పొడవద్దంటూ  డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్‌ను హెచ్చరించారు. సనాతన హిందూ ధర్మం కోసం తిరుపతిలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తక్షణమే ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన. స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్న పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ శ్రీనివాసనంద స్వామి నిలదీశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)