Breaking News

42 ఏపీపీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టండి

Published on Thu, 03/20/2025 - 05:08

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కింది కోర్టుల్లో ఖాళీగా ఉన్న 42 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (ఏపీపీ) పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేయాలని స్పష్టంచేసింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో మొదలు పెట్టాలని తేల్చి చెప్పింది. ఏపీపీ పోస్టులను పెంచినట్లే, మిగిలిన కేడర్‌ పోస్టుల సంఖ్యను కూడా పెంచాల­ని, దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవా­ల­ని ఆదేశించింది. 

తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయ­మూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ఠాకూర్, న్యాయ­మూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కింది కోర్టుల్లో పీపీలు, ఏపీపీలు, అసిస్టెంట్‌ సీనియర్‌ పీపీల పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల పెండింగ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోందని, అందువల్ల పీపీల నియామకానికి చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల­ని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్‌ పిల్‌ దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన సీజే ధర్మాసనం... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ వ్యక్తిగత హాజరుకు ఆదే­శాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు విజ­యా­నంద్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి తీసుకుంటున్న చర్యల గురించి విజయానంద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.  

ప్రస్తుతం ఏపీపీల కేడర్‌ స్ట్రెంత్‌ 204గా ఉందని, దీనిని 209కి పెంచనున్నామని విజయానంద్‌ చెప్పారు. 42 ఖాళీలను డైరెక్టుగా భర్తీ చేస్తామని, ఇందుకు సంబంధించి ప్రక్రియను రెండు నెలల్లో ప్రారంభిస్తామని తెలి­పారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)