Breaking News

జగనన్న ఆరోగ్య సురక్ష ఏర్పాట్లు పక్కాగా చేపట్టండి

Published on Fri, 09/29/2023 - 02:35

సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ప్రారంభించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో కలిసి గురువారం డీఎంహెచ్‌వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు దశల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. శనివారం వైద్య శిబిరాలు ప్రారంభించే ప్రాంతాల్లో ఇప్పటికే గ్రామాల్లో తొలి దశ సర్వే పూర్తయిందన్నారు.

రెండు, మూడో దశ సర్వేలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇంటింటి సర్వేలను పక్కాగా నిర్వహించాలన్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకంపై ప్రజలకు సమ­గ్రంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్యశ్రీ కరపత్రాలను ప్రతి ఇంటికీ అందజేయాలని స్పష్టం చేశారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ మొబైల్‌ యాప్‌ను స్మార్ట్‌ ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేయించి వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించే తేదీలకు సంబంధించి గ్రామాల్లో దండోరా వేయించాలని చెప్పారు. క్యాంపులకు స్పెషలిస్టు వైద్యులు వస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా చూడాలన్నారు.

ఆర్థో­పెడిక్‌ వైద్య నిపుణుడి అవసరం ఉందనే విజ్ఞప్తులు ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్నాయని, క్యాంపులలో వీలైనంతవరకు ఆర్థోపెడిక్‌ వైద్యులు ఉండేలా చూడాలని సూచించారు. డీఎంహెచ్‌వోలు, ఇతర ఉన్నతాధికారులు వైద్య శిబిరాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. సమీక్షలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌ రామిరెడ్డి పాల్గొన్నారు.

మారిన వైద్య రంగం ముఖచిత్రం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగం ముఖచిత్రం మారిపోయిందని మంత్రి విడదల రజిని అన్నారు. వివిధ కార్యక్రమాల అమలులో జాతీయ స్థాయిలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ హెల్త్‌ అకౌంట్‌లకు అత్యధిక రికార్డులను లింక్‌ చేసి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి అవార్డు కైవసం చేసుకోవడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

జాతీయ స్థాయిలో రాష్ట్రానికి వచ్చిన అవార్డులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్‌ మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయంలో గురువారం మంత్రి రజినికి అందజేశారు. ఈ సందర్భంగా అధికారులను ఆమె అభినందించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)