Breaking News

సీజనల్‌ వ్యాధుల కట్టడికి చర్యలు తీసుకోండి

Published on Sat, 06/22/2024 - 04:40

సాక్షి, అమరావతి: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా కట్టడి చేసేందుకు సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అధికారులను ఆదేశించారు. ఏటా వర్షాకాలంలో వాతావరణం మారే సమయంలో వచ్చే వ్యాధులు గ్రామీణుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయన్నారు. తాగునీటి కాలుష్యం మూలంగానే అతిసార వ్యాధి, విష జ్వరాలు లాంటివి ప్రబలుతున్నాయని చెప్పా­రు. 

పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీ­వలæ కాకినాడ జిల్లా కొమ్మనపల్లి, బెండపూడి, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అతిసార ప్రబలిన నేపథ్యంలో శుక్రవారం శాసనసభ సమా­వేశ మందిరంలో అత్యవసరంగా పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో పవన్‌ కళ్యాణ్‌ సమీక్ష నిర్వహించారు.

ఇందులో పురపా­లక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారా­యణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ కూడా పాల్గొన్నారు. నీరు కలుషితమైన చోట నీటి సరఫరా ఆపేసి తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ­రాజ్, గ్రామీణా­భివృద్ధి శాఖ అధికారులను పవన్‌ ఆదేశించారు.

కార్యాచరణ సిద్ధం చేయాలిపైపులైన్ల తనిఖీ ఎప్ప­టికప్పుడు జరిగేలా చొరవ తీసుకోవాలని, మరమ్మతులు అవస­రమైతే తక్ష­ణమే చేయాలని మంత్రులు ఆదేశించారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరా విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ తగదని, ట్యాంకులను ఎప్పటిక­ప్పుడు శుభ్రం చేయాలని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. సీజనల్‌ వ్యాధులు, అంటు వ్యాధులను అరికట్టేందుకు పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకో­వాలన్నారు. 

కాగా, కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు, స్థానిక సంస్థలకు వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అతిసార వ్యాధి నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్ర­మాన్ని నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్య­దర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, పంచాయ­తీ­రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య­దర్శి శశి­భూషణ్‌ కుమార్, మహిళా, శిశు సంక్షే­మశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్మి తదితరులు పాల్గొన్నారు. 
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)