Breaking News

టీడీపీ నేత ఇంటిని ముట్టడించిన టైలర్లు 

Published on Mon, 11/06/2023 - 05:05

డోన్‌ టౌన్‌: తమ సొంతింటి కల సాకారం కాకుండా అడ్డుపడుతున్న టీడీపీ నేత కన్నపకుంట గోవిందరెడ్డి ఇంటిని టైలర్లు ఆదివారం ముట్టడించారు. టీడీపీ హయాంలో డోన్‌ పట్టణ టైలర్ల సంఘం అధ్యక్షుడిగా కన్నపకుంట గోవిందరెడ్డి వ్యవహరించారు. టైలర్లకు టీడీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఆ స్థలాల్లో కొంతమంది బేస్‌మట్టం వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. మరికొందరు తమ స్థలాలను అమ్ముకున్నారు. ఇలా జరిగిన అమ్మకాల్లో గోవిందరెడ్డి పాత్ర ఉన్నట్టు చెబుతున్నారు.

అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఆ స్థలాల్లో టిడ్కో ఇళ్లు కట్టిస్తామని స్థలాలను తీసేసుకుంది. అప్పటికే నిర్మించిన బేస్‌మట్టాలను తొలగించారు. టిడ్కో ఇళ్లు ప్రభుత్వం నిర్మించి నిజమైన లబ్దిదారులకే ఇస్తుంది. దీంతో అనధికారికంగా వాటిని కొను­గోలు చేసినవారు ఆందోళన వ్యక్తంచేశారు. అయితే వారికి కూడా టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని చెప్పి వారి వద్ద నుంచి కూడా గోవిందరెడ్డి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.

ప్రస్తుత ప్రభుత్వం నిజమైన టైలర్లకు మాత్రమే టిడ్కో గృహాలు కేటాయిస్తూ జీవో జారీ చేయడంతో రూ.లక్షలు చెల్లించిన వారు గోవిందరెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో గోవిందరెడ్డి కోర్టుకు వెళ్లడంతో టిడ్కో గృహాల పంపిణీ వాయిదాపడింది. దీంతో టైలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఇంటిని ముట్టడించారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)