Breaking News

‘నన్ను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారు’

Published on Sat, 06/14/2025 - 08:57

సాక్షి, అనంతపురం: హైకోర్టు ఆదేశాలను ఏపీ పోలీసులు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. అలాగే, తనను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు.. తనను అడ్డుకోవడం పట్ల కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక​ం చేశారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. ‘నేను తాడిపత్రి వెళితే భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో ప్రధాన మంత్రి పర్యటన ఉందని.. భద్రత కల్పించలేమని ఎస్పీ జగదీష్ వివరణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏడెనిమిది సార్లు నేను తాడిపత్రి పర్యటన వాయిదా వేసుకున్నా. నాకు తాడిపత్రిలో సొంత ఇళ్లు ఉంది.. నా ఇంటికి నేను వెళ్తానంటుంటే పోలీసులు అడ్డుపడుతున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారు. నన్ను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారు

నేను తాడిపత్రి వస్తానని తెలిసిన ప్రతిసారీ.. రౌడీలు, గూండాలు ఉన్న ప్రైవేటు సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. తాడిపత్రిలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. తాడిపత్రిలో ఐపీఎస్ అధికారి విధులు నిర్వహిస్తున్నా ఏం ప్రయోజనం లేదు. విచ్చలవిడిగా గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. నేను తాడిపత్రి వెళితే టీడీపీ నేతల అక్రమాల దందా సాగదని జేసీ భయపడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. శనివారం ఉదయమే తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్ఢి పెద్దారెడ్డి బయలుదేరారు. వెంటనే ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు.. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు వాహనాలు అడ్డుపెట్టి మరీ పెద్దారెడ్డిని అడ్డుకోవడం గమనార్హం. ఈ సందర్బంగా పోలీసులు తీరుపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు.. ఎందుకు అడ్డుకుంటున్నారని.. ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 

Kethireddy: నేనంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కి భయం

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)