Breaking News

బాబు మాజీ పీఎస్‌ ‘పెండ్యాల’ సస్పెన్షన్‌

Published on Sun, 10/01/2023 - 04:30

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాసరావుపై సస్పెన్షన్‌ వేటుపడింది. ఈయన ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. స్కిల్‌ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు ఉంది. విచారణ నిమిత్తం సీఐడీ గతంలో ఆయనకు నోటీసులు కూడా జారీచేసింది. అయితే, ఆయన ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయారు.

ప్రభుత్వం అనుమతిలేకుండా అమెరికాకు వెళ్లడం సర్విసు రూల్స్‌ను అతిక్రమించడమేనని సర్కారు స్పష్టంచేసింది. మరోవైపు.. శ్రీనివాసరావు  శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా ప్రభుత్వం నోటీసు పంపింది. అయితే, ఆయన రాకపోవడంతో సర్విసు నిబంధనల మేరకు ఆయనను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఇక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శ్రీనివాసరావుపై సస్పెన్షన్‌ తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు కొనసాగుతుందని ప్రభు­త్వం అందులో స్పష్టంచేసింది. ఈ కాలంలో రాష్ట్ర హెడ్‌ క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని పేర్కొంది. సస్పెన్షన్‌ సమయంలో శ్రీనివాసరావుకు నిబంధనల మేరకు అలవెన్స్‌ను చెల్లించనున్నట్లు అందులో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.  

పెండ్యాల పారిపోయింది ఇలా.. 
♦ అమెరికాలో తన తోడల్లుడి గృహప్రవేశంతో పాటు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉండటంతో సెలవు కోరుతూ ఆగస్టు 23న ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు.  
♦  స్కిల్‌ కుంభకోణంలో విచారించడానికి సీఐడీ ఆయనకు నోటీసులిచ్చినట్లు సెపె్టంబర్‌ 5, 6 తేదీల్లో వివిధ పత్రికల్లో వార్తలు వచ్చాయి.  
♦    దీంతో అత్యవసర ఆరోగ్య పరీక్షల కోసం తక్షణం అమెరికా వెళ్లాలంటూ సెపె్టంబర్‌ 5న మరో లేఖ రాశారు. కానీ, ఈ లేఖతో ఆరోగ్యానికి సంబంధించి కానీ, డాక్టరు సిఫార్సు లేఖ కానీ జతచేయలేదు. 
♦    సెపె్టంబర్‌ 6న ప్రభుత్వ సర్విసు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతి లేకుండానే అమెరికా వెళ్లిపోయారు. 
♦    అనంతరం.. ఆరోగ్యం బాగోలేదు దానితో వెంటనే అమెరికా వెళ్లిపోయాను, లీవ్‌ ఇవ్వమని కోరుతూ సెపె్టంబర్‌ 7న లేఖ రాశారు. సాధారణంగా ఇటువంటి సెలవులకు కనీసం 10 రోజుల ముందుగా లేఖ రాయాల్సి ఉంటుంది. 
♦  ఇక ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన హఠాత్తుగా అమెరికా వెళ్లిపోయారని నిర్థారించుకున్న తర్వాత సెపె్టంబర్‌ 13న సెలవును తిరస్కరించారు. 
♦  తక్షణం విధుల్లో చేరాల్సిందిగా మెమో జారీచేయగా సెపె్టంబర్‌ 20న సెలవు కోరుతూ మరో లేఖ రాశారు. 
♦  ఆ తర్వాత మరో మూడ్రోజుల అదనపు సమయం ఇచ్చినా విధుల్లో చేరకపోయేసరికి ప్రభుత్వం సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)