Breaking News

ఏపీ–కర్ణాటక సరిహద్దుల్లో గనుల సర్వే

Published on Fri, 07/05/2024 - 05:29

రాయదుర్గం: ఆంధ్రప్రదేశ్‌–కర్ణాటక రాష్ట్రాల సరి­హద్దు అటవీ ప్రాంతాల్లోని కర్ణాటక భూభాగంలో ఉండే ఏడు గనుల మైనింగ్‌ లీజుల విభజన ప్రక్రి­యపై గురువారం సీఈసీ కమిటీ సభ్యులు సర్వే నిర్వహించారు. 2009లోనే ఈ ఏడు గనుల్లో కంపెనీల కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. సీపీ గోయల్, ఎన్‌హెచ్‌ సునీల్‌ నేతృత్వంలో ఇరు రాష్ట్రాలకు చెందిన మైనింగ్, రెవెన్యూ, అటవీ, ల్యాండ్‌ రికార్డు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సర్వే కొనసాగింది. 

కర్ణాటకలోని సండూరు తాలుకా తుమిటి, విఠలాపురం నుంచి ఏపీ సరిహద్దులోని అనంతపురం జిల్లా డి హీరేహాళ్‌ మండలం మలపనగుడి గ్రామ సరిహద్దులోని మోహబుల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ (ఎంబీటీ) గని వరకు సర్వే చేపట్టారు. హింద్‌ ట్రేడర్స్‌ (హెచ్‌టీ), టి.నారాయణరెడ్డి (టీఎన్‌ఆర్‌) తదితర గనుల లీజ్‌దారులు సర్వేలో పాల్గొని లీజు అగ్రిమెంట్లు అధి­కా­రులకు సమర్పించారు. వాటి ఆధారంగా పునః­పరిశీలన జరిపారు. సరిహద్దు ప్రాంతాలను జీపీఎస్‌ రీడింగ్‌తో సర్వేచేశారు. 

గుర్తించిన రీడింగ్, పాయింట్లను రెవెన్యూ శాఖ హద్దులతో పోల్చి చూశారు. ఆ వివరాలను కేంద్ర ఉన్నతాధికారి సమితి (సీఈసీ)కి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. వీటి ఆధారంగా ఈనెల 5న శుక్రవారం డోనమలై (ఎన్‌ఎండీసీ) ప్రాంతంలో ఇరు రాష్ట్రాల అధికారుల ఆధ్వర్యంలో లీజుదారులతో సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 

ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి మైనింగ్‌ ఏడీ నాగయ్య, డీఎఫ్‌ఓ వినీత్‌­కుమార్, ల్యాండ్‌ సర్వే ఏడీ రూప్లానాయక్, కళ్యాణ­దుర్గం ఆర్డీఓ రాణిసుస్మిత, ఫారెస్ట్‌ రేంజర్‌ పి.మధు­బాబు, డీ.హీరేహాళ్‌ తహసీల్దార్‌ ఈశ్వరరెడ్డి, కర్ణాటక రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)