Breaking News

యూరియా కావాలంటే పురుగుమందు కొనాల్సిందే.!

Published on Sun, 08/31/2025 - 05:08

నిమ్మనపల్లె: యూరియా అవసరాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్జనకు తెరలేపాడో ఎరువుల దుకాణ యజమాని. యూరియా కావాలంటే ఎరు­వులు, లేదా పురుగుమందు కొనుగోలు చేయాలని కండిషన్‌ పెట్టాడు. పైపెచ్చు ఒక్కో యూరియా కట్టకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అదనంగా రూ.80 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తూ రైతులను మోసగించిన ఘటన శనివారం అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లెలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న బాలాజీ ఫెర్టిలైజర్స్‌ దుకాణంలో యూరియా కొనుగోలుకు పెద్దసంఖ్యలో రైతు­లు బారులు దీరారు.

ఇతర దుకాణాల్లో యూ­రియా లేకపోవడం,  డిమాండ్‌ అధికంగా ఉండటంతో దుకాణ యజమాని అధిక ధరలకు విక్రయించసాగాడు. దీంతో ఆగ్రహించిన రైతులు సమస్యను స్థానిక మీడియా దృష్టికి తీసుకురాగా, దుకాణ యజమానిని ప్రశ్నిస్తే...నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో వారు మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఏవో మంజుల,  బాలాజీ ఫెర్టిలైజర్స్‌ దుకాణాన్ని తనిఖీ చేశారు. చల్లావారిపల్లెకు చెందిన రైతు ఆదినారాయణ యూరియా కోసం రూ.850 విలువైన గడ్డిమందును అవసరం లేకున్నా కొనుగోలు చేయా­ల్సి వచ్చిందని చెప్పారు.

మరో రైతు ఈశ్వరయ్య రెండు బస్తాల యూరియా కోసం రూ.1,600 విలువచేసే సీఎన్‌ఎస్‌ కాంప్లెక్స్‌ ఎరువులు కొనుగోలు చేశానన్నారు. ఏవో తనిఖీల్లో యూరియా అధిక ధరలకు విక్రయించడం, పురుగుమందు కొంటేనే ఇస్తానని చెప్పడం రైతుల విచారణలో నిర్ధారణ అయ్యింది. అలాగే అమ్మిన యూరియాకు సంబంధించి బిల్లు ఇవ్వలేదని రైతులు ఫిర్యాదుచేశారు.

దీంతో ఏవో మంజుల బాలాజీ ఫెర్టిలైజర్స్‌ దుకాణంలో ఉన్న 250 బస్తాల యూరియాను దగ్గరుండి రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పంపిణీ చేయించారు. దుకాణంలో నిల్వ ఉన్న  8.4 మెట్రిక్‌ టన్నుల ఐదురకాల ఎరువులను సీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడిన దుకాణ యజమానికి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)