సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట.. కూటమి సర్కార్‌కు షాక్‌

Published on Wed, 07/02/2025 - 11:56

సాక్షి, ఢిల్లీ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్‌ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు  ఆసక్తి చూపలేదు. అనంతరం, తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.

అయితే, మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని  సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు ఆసక్తి చూపించలేదు. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. తమ వాదన వినకుండా బెయిల్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. అక్రమ మైనింగ్‌ జరిగిందని చెప్పుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. 

ఇక, అన్ని కేసుల్లో బెయిల్‌ వచ్చి ఈరోజు విడుదలవుతున్న నేపథ్యంలో వంశీని విడుదల కాకుండా చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కూటమి కేసులు పెట్టింది.

సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)