వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు
Breaking News
ఆయనే మన జేమ్స్‌బాండ్: సీఎం జగన్
Published on Tue, 11/15/2022 - 08:21
సాక్షి, తాడేపల్లి/హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కన్నుమూతతో సినీ జగత్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నటశేఖరుడి అస్తమయంపై స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు. ‘‘కృష్ణగారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఘట్టమనేని కుటుంబంతో వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది.
మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. (2/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 15, 2022
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం కృష్ణ కన్నుమూతపై సంతాపం ప్రకటించారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు సంతాపం ప్రకటించిన వాళ్లలో ఉన్నారు.
ఇదీ చదవండి: నటశేఖరుడికి సాక్షి ప్రత్యేక నివాళి
Tags : 1