Breaking News

మాయా వేదికపై ‘మహా’ డ్రామా!

Published on Mon, 05/26/2025 - 05:37

సాక్షి, అమరావతి: కడప మహానాడు వేదికగా మరో కొత్త డ్రామాకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతు న్నారు. 2023లో రాజమండ్రి మహానాడులో ప్రజలను మోసం చేసే మహా ప్రణాళికను ప్రకటించారు. ఇప్పుడు కడప మహానాడులోనూ అదే తరహాలో మరో కొత్త ప్రణాళిక విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈసారి తన కుమారుడు లోకేశ్‌ను అందలం ఎక్కి­ంచే వేదికగా మహానాడును ఉపయోగించుకోవడానికి పకడ్బందీ వ్యూహ రచన చేశారు. 

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి న సూపర్‌ సిక్స్, ఇతర హామీలను అటకెక్కించిన చంద్రబాబు.. మళ్లీ అదే తరహాలో తన కుమారుడి ద్వారా సూపర్‌ సిక్స్‌ విధా­నాలంటూ టీడీపీ శ్రేణుల్ని సంతృప్తి పరిచేందుకు కొత్త పల్లవిని వల్లె వేయించనున్నట్లు తెలుస్తోంది. ‘పేదరిక నిర్మూలన, స్త్రీ శక్తి, కార్యకర్తే అధినేత, అన్నదాతకు అండ, ఉన్నత స్థాయికి తెలుగు యువత, తెలుగు జాతి ఖ్యాతి’ పేర్లతో వాటిని రూపొ­ందించినట్లు తెలిసింది. ఈ ఆరు విధానాలను పార్టీ కార్యకర్తల కోసం అమలు చేస్తామని మహానాడు వేదికపై ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

మళ్లీ ‘సూపర్‌’ మోసం
2023లో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీల తరహాలోనే మహానాడులో సూపర్‌ సిక్స్‌ విధానాల పేరుతో మాయ చేసేందుకు బాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు పేర్లతో  వీటిని రూపొందిస్తున్నట్లు సమాచారం. సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా కాలక్షేపం చేస్తూ ఇప్పుడు కొత్తగా సూపర్‌ సిక్స్‌ విధానాలంటే ఎవరు నమ్ముతారని టీడీపీ నేతకులే వ్యాఖ్యానిస్తున్నారు. 

సూపర్‌ సిక్స్‌ పథకాలైన మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికీ తాగునీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్‌ టు రిచ్‌..లలో ఒక్క పథకమూ అమలుకు నోచుకోలేదు. మహిళలకు ప్రతి నెలా రూ.1500, తల్లికి వందనం పేరుతో బడికెళ్లే పిల్లలు ఒక్కొక్కరికి రూ.15 వేలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలంటూ చెప్పినా దేన్నీ ఇవ్వలేదు. రైతులకు ఏడాదికి రూ.20 వేల ఆరి్థక సాయం చేస్తామని పట్టించుకోలేదు. నిరుద్యోగులకు రూ.20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇవేమీ అమలు కాలేదు.

ప్రజల్లో ఆగ్రహం.. అందుకే ఆర్భాటం
» కూటమి ప్రభు­త్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క సంక్షేమ పథకం అందక పోవడంతో ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. దీంతో వాళ్లను ఏదో ఒక రకంగా మాయ చేసేందుకు తమ ప్రభుత్వం ఎంతో చేసేసినట్లు, ఏడాదిలో అనేక విజయాలు నమోదు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు.
»    ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ విధానాలను తెరపైకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డబ్బులు లేవని, ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ఏమీ ఇవ్వలేననే విషయాన్ని చంద్రబాబు నెమ్మదిగా చెప్పారు. బయట నుంచి చూసి అన్నీ చేయగలననుకుని హామీలు ఇచ్చానని, ఇప్పుడు ఎలా చేయాలో తెలియడం లేదని వాపోతున్నారు. 
»   దీన్నిబట్టి హామీలపై చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఇప్పుడు మహానాడులో తమ వైఫల్యాలు, హామీల అమలు ఊసే లేకుండా మాయ చేసేందుకు టీడీపీ పరివారం నిమగ్నమైంది. ఎల్లలు లేని ప్రచారం, సోషల్‌ మీడియాలో బజ్‌ సృష్టించి లబ్ధి పొందడంపైనే దృష్టి కేంద్రీకరించారు.
»  వైఎస్‌ జగన్‌ ఇస్తున్న పథకాల కంటే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి.. ఆచరణలో ఏమీ చేయక పోవడంతో తాము చంద్రబాబు చేతిలో మరోమారు మోసపోయామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ మోసాలకు ఎల్లో మీడియా వంత పాడుతుంటే కనుక్కోలేని వెర్రి వాళ్లమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహాన్ని చల్లార్చడానికే మరోసారి మాయా వేదిక సిద్ధమైంది. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)