Breaking News

పోలీసుల వేధింపులతో.. కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం

Published on Thu, 07/31/2025 - 05:13

సాక్షి, టాస్క్ ఫోర్స్  :  వైఎస్సార్‌ కడప జిల్లా కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన ఆర్‌. చిన్నబాలయ్య (45) స్థల వివాదం విషయంలో పోలీసుల వేధింపులు తాళలేక మంగళవారం పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లా కోర్టు ఆవరణలోనే ఆయన ఈ అఘాయిత్యానికి యత్నించడంతో ఆయన్ను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. అక్కడ న్యాయమూర్తి అతని నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అనంతరం.. కడప వన్‌టౌన్‌ పోలీసులు బాధితుడు, అతని బంధువుల స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం పోలీసులు ఆయన్ను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

స్థలాల ఆక్రమణకు పోలీసుల యత్నం.. 
అతడి సోదరులు ఏసన్న, బాలయ్య మీడియాతో మాట్లాడారు. తమ గ్రామంలో 2007లో సుగుమంచిపల్లె ఆర్‌ అండ్‌ ఆర్‌లో ఒకొక్కరికి ఐదుసెంట్ల చొప్పున ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇచి్చందన్నారు. తమ సోదరుడు చిన్నబాలయ్యకు ఇచ్చిన స్థలాన్ని, ఇంకా కొందరి స్థలాలను ఆక్రమించుకునేందుకు కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. 

ఇందులో భాగంగా.. హోంగార్డులు తిరుపతయ్య, నాగార్జునరెడ్డి.. కానిస్టేబుల్‌ నరసింహులుతో పాటు గ్రామస్తులు దత్తాపురం మాధవరెడ్డి, తుంగ జగదీశ్వర్‌రెడ్డి, బెస్త వేణు, బెస్త ప్రసాద్, మేకల బాలగంగిరెడ్డి వేధిస్తున్నారని.. వీరికి తాళ్ల ప్రొద్దుటూరు ఎస్‌ఐగా పనిచేసి ప్రస్తుతం అదనపు ఎస్పీగా ఉన్న వెంకటరాముడు వత్తాసు పలుకుతూ తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 

తలమంచిపట్నం, తాళ్ల ప్రొద్దుటూరు, చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్లలో చిన్నబాలయ్యపై దొంగతనాల కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారన్నారు. నిందితులపై కేసు నమోదుచేయాలని తాము పోలీసులను కోరామన్నారు. అయితే, జడ్జి స్టేట్‌మెంట్‌ ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి ఇస్తామని పోలీసులు తెలిపినట్లు బాధితుడి సోదరులు చెప్పారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)