ప్రచారానికి వాడుకుని వదిలేశారు: సుగాలి ప్రీతి తల్లి పార్వతి

Published on Tue, 09/02/2025 - 05:55

నంద్యాల (అర్బన్‌): హ­త్యాచారానికి గురైన తన కుమార్తె సుగాలి ప్రీతి అంశాన్ని జనసే­నాని పవ­న్‌కళ్యాణ్‌ ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకుని ఇప్పుడు గాలికి వదిలేశారని ఆమె తల్లి పార్వతి విమర్శించారు. నంద్యాల­లో సోమవారం గిరిజన సంఘాలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఈ కేసును గాలికి వదిలేశారన్నారు. న్యాయం చేయాలంటూ అమ­రావతికి వెళితే జన సైనికులు, వీర మహిళలతో అవమానాలకు గురి చేస్తున్నారని.. ఎమ్మెల్యే­లు, మంత్రులు వెటకారం మాటలతో ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా­రు.

లోకేశ్‌ రెడ్‌బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఎందుకు చేర్చలేదో సమాధానం చెప్పాలన్నారు. గవర్నర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానన్నారు. ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు వడిత్య శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడం పవన్‌కళ్యాణ్‌కు అటవాటుగా మారిందని, ప్రీతి తల్లి పార్వతి వీల్‌చైర్‌ యాత్రకు అన్ని గిరిజన ప్రజా సంఘాలు, సమాఖ్యల సంపూర్ణ మద్దతు కూడగడతామన్నారు. కార్యక్రమంలో జీపీఎస్‌ అధ్యక్షుడు రాజునాయక్, ఉపాధ్యక్షుడు రాంబాలాజీనాయక్, మాలమహానాడు అధ్యక్షుడు సాంబశివుడు, బిలావత్‌ శంకర్‌నాయక్, విక్రం సింహనాయక్‌ పాల్గొన్నారు.  

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)