Breaking News

రైతు బజార్లలో సబ్జి కూలర్లు

Published on Mon, 02/10/2025 - 05:14

కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకునేందుకు వీలుగా ఐఐటీ బాంబే విద్యార్థులు అభివృద్ధి చేసిన సబ్జి కూలర్లను రాష్ట్రంలోని రైతుబజార్లలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. టమాటాలు, దోసకాయలు, కాప్సికమ్, ఆకుకూరలను 3 నుంచి 5 రోజులు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, బెండకాయలు వంటి ఇతర కూరగా­యల­తో­పాటు పండ్లు, పూలు వంటివి తాజాదనం కోల్పోకుండా 6 నుంచి 7 రోజులపాటు వీటిలో నిల్వ చేయవచ్చు. ఏడు లేయర్ల ఎవాపరేటివ్‌ కూలింగ్‌ టెక్నాలజీతో తయారు చేసిన ఈ సబ్జి కూలర్లు సాధారణ విద్యుత్‌ లేదా సౌర విద్యుత్‌ ఆధారంగా పనిచేస్తాయి.  – సాక్షి, అమరావతి

మూడు మోడల్స్‌లో సబ్జి కూలర్లు
ఈ సబ్జి కూలర్లను 100 కేజీలు (ధర రూ.50వేలు), 50 కేజీలు (రూ.35,400), 25 కేజీలు (రూ.17,700) సామర్థ్యంతో అభివృద్ధి చేశారు. వీటిని పైలట్‌ ప్రాజెక్టుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 13మంది రైతులకు 50 శాతం సబ్సిడీపై అధికారులు ఇచ్చారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం నగరాల్లోని ఎనిమిది రైతుబజార్లలో రైతులు అందరూ ఉపయోగించుకునేలా మార్కెటింగ్‌ శాఖ ఏర్పాటుచేసింది.

వీటి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వీటిని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 59 రైతుబజార్లలో ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత మిగిలిన రైతుబజార్లలో కూడా వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రైతుబజార్లలో రైతులకు కనీసం 100 కేజీల సామర్థ్యం కలిగిన కూలర్లను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని సంకల్పించారు.

కుప్పంలో 50 మంది రైతులకు...
కుప్పంలో 50 మంది పూల రైతులకు సబ్జి కూలర్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. యూనిట్‌ విలువలో 50శాతం ఉద్యానవన శాఖ భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పొదుపు సంఘాలు, విలేజ్‌ ఆర్గ­జనై­షన్స్‌(వీవో) భరించేలా ప్రణాళిక సి­ద్ధం చేశారు. కుప్పంలో ఈ నెల 20వ తేదీన రైతులకు ఈ సబ్జి కూలర్లను ప్రదర్శించనున్నారు. అనంతరం 28వ తేదీన పొదుపు సంఘాలు, వీవోల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. మార్చి 5న అర్హులను ఎంపకి చేసి, 15వ తేదీలోగా లబ్ధిదారులు తమ వాటా డబ్బులు చెల్లించేలా గడువు ఇస్తారు. మార్చి 31వ తేదీన లబ్ధిదారులకు సబ్జి కూలర్లు పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)