Breaking News

సర్కార్‌పై ఆగ్రహం

Published on Tue, 08/26/2025 - 03:50

సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం/ఏలూరు (టూటౌన్‌)/శ్రీకాకుళం పాత బస్టాండ్‌ : సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని, ఆంక్షలు లేకుండా తల్లికి వందనం అందించాలని, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.    రాజమహేంద్రవరం కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు వచ్చిన విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నిరసనకు అనుమతి లేదంటూ ఒక్కసారిగా విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.

అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు. దొరికినవారిని దొరికినట్లు రోడ్డు పక్కకు ఈడ్చిపారేశారు. లాఠీలతో కొట్టారు. కొందరిని గొంతు పట్టుకుని తోసేయడంతో ఓ విద్యార్థి రోడ్డు పక్కన పడిపోయాడు. పోలీసుల దౌర్జన్యంతో పలువురు విద్యార్థి సంఘం నేతలు, విద్యార్థులకు గాయాలయ్యాయి. సహనం నశించిన విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టరేట్‌ ఎదుట సుమారు నాలుగు గంటలపాటు బైఠాయించారు.

చివరకు డీఆర్వో సీతారామయ్య కలెక్టరేట్‌ బయట గేటు వద్దకు చేరుకుని వినతి పత్రం స్వీకరించడంతో ఆందోళన సద్దుమణిగింది. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించి.. కలెక్టర్‌ వెట్రిసెల్వికి వినతి పత్రం ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కాగా,  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర శాఖ సోమవారం విమర్శించింది. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)