Breaking News

దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు

Published on Mon, 10/16/2023 - 13:28

మంగళగిరి: రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ప్రకటించిన దసరా పండుగ సెలవుల నిబంధనలను అన్ని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు తప్పని సరిగా పాటించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ కేసలి అప్పారావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కార్యాలయంలో మాట్లాడారు. ప్రభుత్వ నియమ నిబంధనలును కొన్ని ప్రైవేటు, కార్పోరెట్ పాఠశాలలు పాటించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో  కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, మరికొన్ని విద్యా సంస్థలు మొబైల్ ఫోన్ ద్వారా హోమ్ వర్కులు చేయమని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడైనా పాఠశాలలు ప్రత్యేక తరగతులు లేదా ఆన్లైన్ తరగతులు లేదా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే apscpcr2018@gmail.com మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

మండల, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను  గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోంది: సీఎం జగన్‌

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?