Breaking News

మృత్యువలయంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌..!

Published on Mon, 06/08/2026 - 19:05

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తాజాగా జరిగిన ప్రమాదం మరోసారి భద్రతా ప్రమాణాలపై చర్చకు దారితీసింది. అయితే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్లాంట్‌లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ విభాగాల్లో జరిగిన ప్రమాదాల్లో పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రధానంగా గ్యాస్‌ లీకేజ్‌, పేలుళ్లు, ద్రవ లోహం లీకేజ్‌ వంటి ఘటనలు జరుగుతూనే ఉండటంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకరంగా మారింది.

తాజాగా విశాఖ స్టీల్‌ప్టాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడగా, పలువురు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దారుణం వెనుక భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇంతటి దారుణం చోటు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. 

2012లో ఘోర ప్రమాదం.. 
అయితే ఈ ఘటన 2012లో విశాఖ స్టీల్‌ ప్టాంట్‌లో జరిగిన ఘోర దుర్ఘటనకు గుర్తుకుతెచ్చింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే జూన్‌ నెలలో 13వ తారీఖున చోటు చేసుకున్న స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఆక్సిజన్ ప్లాంట్ వద్ద పేలుడు సంభవించి 19 మంది దుర్మరణం చెందారు. ఆ సమయంలో పలువురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 

ఆక్సిజన్ పైప్‌లైన్‌లో ఒత్తిడి ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల పైప్‌లైన్ పేలిపోయి, భారీగా మంటలు వ్యాపించాయి. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య ఉండటంతో, అధికారులు మరియు కార్మికులు దానిని పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.దాంతో అక్కడే ఉన్న  పలువురు ఈ ఘోరం బారిన పడ్డారు. 

మరణించిన 19 మందిలో ముగ్గురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, కన్సల్టెంట్లు మరియు పలువురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు.తీవ్ర గాయాలు: ఎందరో ఉద్యోగులు తీవ్రమైన శాతంలో కాలిపోయి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అదే సంవత్సరం  మే 1వ తేదీన కూడా స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నెస్-3 లో జరిగిన మరో పేలుడులో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనమయ్యారు. .

గతేడాది స్టీల్‌ మెల్టింగ్‌ మిషన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో హైడ్రాలిక్‌ ఆయిల్‌ లీకై మంటలు చెలరేగాయి.ఫైర్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ఈసారి ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందారు. 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన మరికొన్ని ప్రమాదాలు..
మే 22, 2012: సింటర్ ప్లాంట్‌లో మంటలు చెలరేగడంతో, కొత్త బ్లాస్ట్ ఫర్నేస్‌కు ముడి పదార్థాన్ని తీసుకువెళ్తున్న కన్వేయర్ బెల్ట్ పూర్తిగా కరిగిపోయింది. రూ. 1 కోటి ఉత్పత్తి నష్టం.

మే 1, 2012: కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్ IIIలో జరిగిన పేలుడులో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఫిబ్రవరి 6, 2012: స్టీల్ మెల్టింగ్ షాప్ లో భారీ పరిమాణంలో వేడి లోహం ఒలికిపోవడం, రూ. 1 కోటి నష్టం

ఏప్రిల్ 10, 2011: సుమారు 140 టన్నుల ద్రవ ఉక్కును తీసుకువెళ్తున్న లాడిల్ నుండి అది కిందపడటంతో ఎస్‌ఎంఎస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది, రూ. 60 కోట్ల నష్టం వాటిల్లింది.

ఏప్రిల్ 14, 2011:  ఎస్‌ఎంఎస్‌లోని కంటిన్యూయస్ కాస్టింగ్ విభాగంలో భారీ పరిమాణంలో వేడి లోహం కింద పడిపోయింది, 140 టన్నుల ద్రవ ఉక్కు నేలపై పడింది. 
ఏప్రిల్ 17, 2011: ముడి పదార్థాల నిర్వహణ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం, మూడు కన్వేయర్ బెల్టులకు నష్టం, రూ. 20 కోట్ల నష్టం

మే 1, 2011: బ్లాస్ట్ ఫర్నేస్‌కు ముడి పదార్థాలను రవాణా చేసే కన్వేయర్ బెల్ట్ మెలితిరగడంతో 48 గంటల పాటు ఉత్పత్తికి అంతరాయం

జూన్ 18, 2011: కోక్ డ్రైయింగ్ కూలింగ్ ప్లాంట్‌లోని రెండు కన్వేయర్ బెల్టులలో ఒకదానిపై వేడి కోక్ పడటంతో అగ్నిప్రమాదం సంభవించింది, రూ. 15 లక్షల నష్టం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)