Breaking News

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల నిరసన

Published on Mon, 11/17/2025 - 10:11

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద కార్మికులు నిరసనలకు దిగారు. కార్మికులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. కార్మికులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ అడ్మిన్ భవన్‌ వద్ద కార్మికులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ..‘చంద్రబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. కార్మికులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఓట్లు కోసం స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత మాట మార్చారు. ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్‌కు ఎటువంటి సంబంధం లేదు. ప్రొడక్షన్‌ను బట్టి జీతాలు ఇస్తామనే సర్క్యులర్ వెంటనే ఉపసంహరించుకోవాలి.

కార్మికుల వలన స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు రాలేదు. స్టీల​ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించకపోవడం వలన నష్టాలు వస్తున్నాయి. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు లేవు. చంద్రబాబు పీపీపీ అంటే ప్రజలు ఛీ.. ఛీ.. ఛీ. అంటున్నారు. చంద్రబాబు దృష్టి అంతా ప్రైవేటీకరణ మీదే ఉంది. విద్యా వైద్య రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్యాకేజీ వలన కార్మికులకు స్టీల్ ప్లాంట్‌కు ఎలాంటి ప్రయోజనం లేదు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం’ అని హెచ్చరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)