Breaking News

మధురవాడలో రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయం! 

Published on Sat, 09/30/2023 - 03:53

సాక్షి, విశాఖపట్నం: దసరా నుంచి పరిపాలన రాజధానిగా మారనున్న విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి కార్యాలయాలకు భవనాల ఎంపిక కోసం అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయాన్ని మధురవాడలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దసరా నుంచి రాష్ట్ర పరిపాలన రాజధాని విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఇటీవల కేబినెట్‌ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రితోపాటు విశాఖ వచ్చే ఉన్నతాధికారులు, ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలను సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలను వేగవంతం చేసింది.

ఇందులో భాగంగా రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయాల ఏర్పాటు, పని విభజనపై కసరత్తు వడివడిగా జరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు విశాఖ డివిజన్‌ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం జాయింట్‌ కమిషనర్‌(జేసీ)–1, 2 కార్యాలయాలు, కొన్ని సర్కిల్‌ కార్యాలయాలు ముడసర్లోవ సమీపంలో ఉన్నాయి. ఈ భవనాన్నే రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి కేటాయించాలని భావించారు. కానీ, సరిపడా గదులు లేకపోవడంతో దానికి ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుని పన్నుల శాఖ కమిషనర్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఇతర అధికారుల కోసం కేటాయించాలని ప్రయత్నించారు.

దీనిపై ఉన్నతాధికారులకు విశాఖ డివిజన్‌ అధికారులు నివేదిక పంపించారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయానికి సమీపంలో భవనాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. దీంతో  విశాఖ డివిజన్‌ జాయింట్‌ కమిషనర్‌ కార్యాలయ అధికారులు మధురవాడలో ఉన్న భవనాలను పరిశీలించారు. నాలుగు అంతస్తులు ఉన్న మూడు భవనాలను పరిశీలించి వాటి వివరాలను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. రెండు వారాల్లోపు ఉన్నతాధికారుల బృందం వచ్చి ఆ భవనాలను పరిశీలించి ఒకదానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)