Breaking News

మోంథా నష్టం రూ.5,244 కోట్లు

Published on Sat, 11/01/2025 - 04:55

సాక్షి, అమరావతి: మోంథా తుపాను నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. 17 శాఖలు, రంగాలలో రూ.5,244 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది. పూర్తిస్థాయిలో వివరాలు వస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ శుక్రవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఈ నివేదిక పంపారు. తక్షణ ఆర్థిక సాయం చేయాలని కోరారు.

 ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని, 1.38 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని 2.96 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని, 1.74 లక్షల మంది రైతులు రూ.829 కోట్ల వరకు నష్టపోయినట్లు వివరించారు. 249 మండలాల్లోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై ప్రభావం ఉందని, 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. 

క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని కోరారు. 12,215 హెక్టార్లలో రూ.40 కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతినగా 23,979 మంది రైతులకు నష్టం వాటిల్లిందని, ఆక్వారంగంలో 32 వేల ఎకరాల్లోని రూ.514 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారని తెలిపారు. 2,261 పశువులు మృతిచెందాయన్నారు. 2,817 విద్యుత్‌ స్తంభాలు నేలకొరగ్గా, 429 కి.మీ. మేర తీగలు తెగిపడ్డాయి. 

ఈ శాఖకు రూ.19 కోట్ల నష్టం జరిగింది. నీటి పారుదల శాఖకు రూ.234 కోట్ల మేర నష్టం కలిగింది.   23 జిల్లాలలోని 3,045 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అంగన్వాడీలు, పాఠశాలలు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, చేనేత మగ్గాలు అన్నీ కలిపి రూ.122 కోట్ల నష్టం వాటిల్లింది. 

బాగా దెబ్బతిన్న రోడ్లు.. మృతులు ముగ్గురు 
రోడ్లు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తుపానుతో ముగ్గురు చనిపోయారని వెల్లడించారు. 4,794 కి.మీ. మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు, 311 కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని, రూ.2,774 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. 

18 జిల్లాల్లోని 862 కి.మీ. మేర పంచాయతీరాజ్‌ రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు పాడవడంతో రూ.454 కోట్ల నష్టం జరిగిందని, 48 పట్టణాల్లోని రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు ధ్వంసమయ్యాయని, వీటి పునరుద్ధరణకు రూ.109 కోట్లు కావాలని నివేదికలో వివరించారు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)