Breaking News

‘ఆపరేషన్‌ సంభవ్‌’ ఆగదు

Published on Fri, 11/21/2025 - 05:06

రంపచోడవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఏపీ పోలీసు శాఖ పని చేస్తున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా చెప్పారు. మావోయిస్టుల ఏరివేతకు ‘ఆపరేషన్‌ సంభవ్‌’ కొనసాగుతుందని స్పష్టంచేశారు. మావోయిస్టుల వైపు వెళ్లే ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. మావో­యిస్టు నాయకులు దేవ్‌జీ, మల్ల రాజారెడ్డి పోలీసుల అదుపులో లేరని చెప్పారు. డీజీపీ గురువారం రంపచోడవరంలో పర్యటించారు. అనంతరం 

ఆయన స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ... వరుసగా రెండు రోజులపాటు జరిగిన ఎన్‌కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతిచెందారని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు హిడ్మా, టెక్‌ శంకర్‌ వంటి వారు మరణించారని చెప్పారు. ఘటనాస్థలాల్లో అధిక సంఖ్యలో ఆయుధాలు లభ్యమయ్యాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సెర్చ్‌ ఆపరేషన్‌లో 50 మంది మావోయిస్టులను అరెస్ట్‌ చేశామన్నారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం సమన్వయంతో పనిచేయడం వల్ల మంచి ఫలితం వచ్చిందన్నారు. 2026 మార్చి నాటికి నక్సల్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే పోలీస్‌ శాఖ అంతిమ లక్ష్యమని డీజీపీ చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేతలు మృతిచెందారని, అప్పుడే మావోయిస్టులు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరామని పేర్కొన్నారు.

హెలికాప్టర్‌ నుంచి అటవీ ప్రాంతంలో పరిశీలన 
విశాఖపట్నం నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా తొలుత మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న గుర్తేడు, పాతకోటతోపాటు తాజాగా మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ జరిగిన జీఎం వలస అటవీ ప్రాంతాన్ని హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)