Breaking News

ఏప్రిల్‌ 11న రాష్ట్ర విభజన కేసు విచారణ

Published on Thu, 02/23/2023 - 05:34

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు సంబం­­ధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ త­దితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్‌ 11న వి­చా­రిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో రెండుసా­ర్లు ఎ­న్నికలు జరగడంతో ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తన పిటిషన్‌లో అభ్యర్థనను మార్చారు.

రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులు, అప్పుల వ్యవహారాలను త్వరగా తేల్చాలని, ఆంధ్రప్రదేశ్‌కు లబ్ధి చేకూరేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై గతేడాది నవంబరు 28న విచారణకు రాగా ఫిబ్రవరి 22న వి­చారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ నెల14న సుప్రీంకోర్టు ఓసర్క్యులర్‌ జారీ చేసింది.

ఓసారి నోటీసు అయిన అంశాలను బుధ, గు­రు­వా­­రాల్లో విచారించబోమని అందులో స్పష్టంచే­సింది. దీంతో బుధవారంనాటి విచారణ జాబితా నుం­చి ఈ కేసును రిజిస్ట్రీ తొలగించారు. దీంతో ఉండ­వల్లి తరఫు న్యాయవాది అల్లంకి రమేశ్‌ మంగళవా­రం సా­­యంత్రం కోర్టు పనివేళల ముగింపు అనంత­రం జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం ముందు ఈ అం­శాన్ని ప్రస్తావించారు.

ఈ పిటిషన్‌ను కనీసం ప­ది, ప­దిహేను రోజులు విచారించాల్సి ఉంటుంద­ని, మూ­­­డు నెలల్లో తన పదవీ విరమణ ఉందని జస్టిస్‌ జోసెఫ్‌ గుర్తుచేశారు. అన్ని రోజులు అవసరంలేదని ర­మే­శ్‌ వివరించారు. దీంతో ఏప్రిల్‌ 11న విచారణ చే­పడతామని, ఆ రోజు జాబితాలో చేర్చాలని ధర్మాస­నం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం అర్ధరా­త్రి సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఈ ఆదేశాలు ఉంచింది.  

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)