Breaking News

శ్రీసిటీలో స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ విద్యార్థులు

Published on Sat, 09/09/2023 - 04:24

వరదయ్యపాళెం: స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్‌మ్యాటిక్స్‌ (ఎస్‌టీఈఎం) విభాగానికి చెందిన 20 మంది అధ్యాపకులు, విద్యార్థులతో కూడిన ప్రతినిధుల బృందం శుక్రవారం శ్రీసిటీని సందర్శించింది. ప్రొఫెసర్‌ మైకేల్‌ కోచెండర్‌ ఫర్, పీహెచ్‌డీ స్కాలర్‌ డైలాన్‌ మిచెల్‌ ఆస్మార్‌ నేతృత్వంలోని ఈ బృందానికి శ్రీసిటీ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) సతీష్‌ కామత్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీసిటీ చైర్మన్‌ సి.శ్రీనిరాజు వర్చువల్‌ విధానంలో వారితో మాట్లాడారు. 1980లలో స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

వర్క్, లివ్, లెర్న్, ప్లే సూత్రం ఆధారంగా పచ్చదనం, పరిశుభ్రత, పారిశ్రామిక అనుకూల వాతావరణంలో శ్రీసిటీ ప్రగతి సాగుతోందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సౌర విద్యుత్‌ ఉత్పత్తి, నీటి నిర్వహణ తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక విస్తరణ, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను కాపాడడంపై తాము ప్రత్యేక దృష్టి సారించామన్నారు. భారతదేశంలో మొట్టమొదటి కార్బన్‌ న్యూట్రల్‌ పారిశ్రామికవాడగా శ్రీసిటీ అవతరించాలన్నది తమ ఆకాంక్ష అన్నారు.

శ్రీసిటీలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం, ఇతర ప్రత్యేకతల గురించి సతీష్‌ కామత్‌ వివరించారు. పెప్సికో, క్యాడ్‌బరీస్, కోల్గేట్‌ పామోలివ్, వీఆర్‌వీ చాట్‌ ఇండస్ట్రీస్, బాల్‌ కార్పొరేషన్, కెల్లాగ్స్, వెస్ట్‌ ఫార్మాతో సహా 11 ప్రముఖ అమెరికన్‌ కంపెనీలతో పాటు ప్రపంచంలోని 28 దేశాలకు చెందిన 210 పరిశ్రమలు శ్రీసిటీలో ఏర్పాటైనట్లు తెలిపారు. శ్రీసిటీ అభివృద్ధి పట్ల స్టాన్‌ఫోర్డ్‌ బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీసిటీ మోడల్, ఇక్కడ అమలు చేస్తున్న సుస్థిరత కార్యక్రమాలను నేరుగా వీక్షించి అర్థం చేసుకోవడమే తమ పర్యటన ముఖ్య ఉద్దేశంగా వారు తెలిపారు. అనంతరం శ్రీసిటీలోని క్రియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.

Videos

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)