Breaking News

‘వరద’ సాయం పంపిణీలో హాహాకారాలు!

Published on Sat, 09/28/2024 - 05:03

పాయకాపురం (విజయవాడరూరల్‌): వరద బాధితు­ల సహాయార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కుక్కర్లు, గ్యాస్‌ స్టవ్‌ల పంపిణీ ప్రారంభించి.. ఒక్కసారిగా గేట్లు తీయడంతో బాధితులంతా కల్యాణ మండపంలోకి ప్రవేశించడంతో జరిగిన తొక్కిసలాటలో వృద్ధులు, మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని 64వ డివి­జన్‌ కండ్రికలోని కల్యాణమండపంలో వరద బాధితుల సహాయార్థం టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గ్యాస్‌­స్టవ్‌లు, కుక్కర్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశా­రు.

అయితే గురువారం రాత్రే టీడీపీ, జనసేన పార్టీ కా­ర్యకర్తలకు కూపన్లు పంపిణీ చేశారు. సర్వం కోల్పోయిన బాధితులంతా అక్కడికి చేరుకుని క్యూలైన్లలో నిలబ­డ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే బొండా ఉమా, అధికార ప్రతినిధి పట్టాభి, బుద్ధా వెంకన్న పంపిణీ ప్రారంభించారు. కల్యాణ మండపం గేట్లు తెరవడంతో బాధితులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో భారీ ఎత్తున తోపులాట జరిగింది. వృద్ధులు, మహిళలు కిందపడిపోయారు. వారిపై బారికేడ్లు పడడం, వెనుక నుంచి వచ్చే వారు తొక్కు­కుంటూ వెళ్లడంతో ఊపిరాడక హాహాకారాలు చేశారు. 

ఆ ప్రాంతమంతా  బాధితుల ఆర్తనాదా­లతో మార్మోగిపో­యింది. వికలాంగులకు ప్రత్యేక ఏర్పా­ట్లు చేయకపోవడంతో వారు తోపులాటలో చిక్కుకుని గాయపడ్డారు. పోలీసులు అదుపు చేయ­లేక చేతులెత్తేశారు. మహిళా పోలీసులు బారికేడ్లను తొలగించడంతో ప్రాణ నష్టం తప్పింది. టీడీపీ జనసేన కార్యకర్తలకే టోకెన్లు పంచుకున్నారు. ముఖాలు చూసి మరీ టోకెన్లు ఇచ్చారు. టీడీపీ జనసేన కార్యకర్తలే వరద బాధితులా? మేం బాధితులం కాదా అంటూ కండ్రిక వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)