Breaking News

ప్రభుత్వ ఉద్యోగులపై సర్కారు

Published on Fri, 09/27/2024 - 05:32

ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను  నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాల్సిన చంద్రబాబు సర్కారు ఆ పని చేయకపోగా.. తిరిగి వారిపైనే కత్తి దూస్తోంది. ఇప్పటికే  రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలు చేపట్టింది.  ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయ (సెక్రటేరియట్‌) ఉద్యోగుల  సంఘం గుర్తింపు రద్దుకు రంగం సిద్ధం చేసింది. సంబంధిత ఫైల్‌ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇప్పటికే చేరింది. – సాక్షి, అమరావతి

ఉద్యోగులకు మధ్యంతర భృతితోపాటు క్రమం తప్పకుండా  డీఏ ఇస్తామని, సీపీఎస్‌ స్థానంలో మెరుగైన పెన్షన్‌ విధానం తెస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారం చేపట్టాక వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయకపోగా.. ఆ విషయంపై ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలను అణచివేసే ప్రయత్నాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ సంఘం గుర్తింపు రద్దు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

70 ఏళ్ల సంఘాన్ని నిర్వీర్యం చేసేందుకు కంకణం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ హోదాలో కాకర్ల వెంకట్రావిురెడ్డి ఈ ఏడాది మార్చి నెలలో ఆర్టీసీ ఉద్యోగులను కలిశారు. ఎలాంటి సమావేశం, ప్రెస్‌మీట్‌ పెట్టకపోయినా కొన్ని పత్రికలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ తప్పుడు వార్తలు రాయడంతో ఆయనను సస్పెండ్‌ చేశారు. అంతటితో ఆగకుండా ఆయనపై నాలుగు కేసులు పెట్టించారు. 

దీంతో సంతృప్తి చెందని ప్రభుత్వం ఇపుడు ఏకంగా ఆంధ్ర ప్రదేశ్‌ సచివాలయ సంఘం గుర్తింపును రద్దు చేసేందుకు సిద్ధపడింది. విచారణ నివేదికలు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘం పేరు కూడా లేదు. అయినా కేవలం వెంకట్రావిురెడ్డిపై కక్షతో 70 ఏళ్ల చరిత్ర గల ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది.

అప్పట్లో ఉద్యోగ సంఘాలను వాడుకుని..
2019 ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల నాయకులను చంద్రబాబు ఎలా వాడుకున్నారో అందరికీ తెలిసిందే. సత్యాగ్రహ దీక్ష పేరుతో ప్రత్యేక విమానంలో  ఉద్యోగ సంఘాల నాయకులను ఢిల్లీ తీసుకెళ్లి.. వారితో నల్లచొక్కాలు తొడిగించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తిట్టించారు. బీజేపీని ఒక్క స్థానంలో కూడా గెలవనివ్వబోమని, ఏపీ నుంచి బీజేపీని తరిమి తరిమి కొడతామని పెద్దఎత్తున ప్రకటనలు కూడా అప్పట్లో ఉద్యోగ సంఘాల నాయకులతో ఇప్పించారు. 

2019 ఎన్నికల తర్వాత వారిపై చర్యలు తీసుకోవాలని చాలా ఫిర్యాదులు వచ్చాయి. అయినా అప్పటి ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దమనసుతో వ్యవహరించారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ పనులు చేయించుకునేందుకు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటం సహజమేనని,   అలాంటి చిన్నచిన్న విషయాలకు ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించారు. 

కానీ.. ఇప్పుడు చంద్రబాబు ఉద్యోగులెవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘానికి ఎలాంటి సంబంధం లేని ఘటనను సాకుగా చూపించి.. సంఘాన్ని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఒకవేళ ప్రభుత్వ సంఘాల సమాఖ్య చైర్మన్‌ హోదాలో వెంకట్రావిురెడ్డి తప్పు చేస్తే ఆయనపై చర్యలు తీసుకోవాలి తప్ప సంఘాన్ని నాశనం చేయడం ఏమిటని సచివాలయ ఉద్యోగులంతా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వింత ఎప్పుడూ చూడలేదని వారంతా పేర్కొంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)