Breaking News

ఉర్దూ అకాడమీలో అలజడి

Published on Sat, 03/15/2025 - 05:31

సాక్షి, అమరావతి: ఏపీ ఉర్దూ అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో విస్తుపోయే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రూ.కోట్లాది నిధుల అవకతవకల వ్యవహారం ఎక్కడ తమ మెడకు చు­ట్టుకుంటుందోనని ఇంటి దొంగల్లో కలవరం తీవ్రమైంది. ‘‘ఉర్దూ అకాడమీలో అంతులేని అక్ర­మాలు’’ శీర్షికన ‘‘సాక్షి’’ ప్రచురించిన కథనంతో అకా­డమీలో అలజడి మొదలైంది. తాజాగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌తో కొందరు అకాడమీ ఉద్యోగులు టీడీపీకి చెందిన మైనార్టీ నాయకుడి మధ్యవర్తిత్వంలో మంత్రాంగం సాగించడం చర్చనీయాంశమైంది.

త్వరలో విచారణ 
గత టీడీపీ హయాం(2016–17)లో రూ.3.15 కోట్లు తెలంగాణ ఉర్దూ అకాడమీకి అప్పుగా ఇచ్చినట్టు ఏపీ ఉర్దూ అకాడమీ ఆడిట్‌ రిపోర్టులో లెక్కలు చూపించారు. దీనిపై ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగుల్‌మీరా తెలంగాణ ఉర్దూ అకాడమీని సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా తాము ఏపీ నుంచి ఎలాంటి అప్పు తీసుకోలేదని తేల్చిచెప్పింది. దీంతో చర్యలు తీసుకోవాలని నాగుల్‌మీరా లోకాయుక్తను ఆశ్రయించారు. 

ఫిర్యాదును క్షుణ్నంగా పరిశీలించి విచారణకు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర లోకా­యుక్త రిజిస్ట్రార్‌ గతేడాది నవంబర్‌ 26న ఏపీ మైనా­ర్టీ సంక్షేమ శాఖ కార్యదర్శికి నోటీసు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం జనవరి 6న విచారణ కమి­షన్‌ను నియమించింది. రూ.3.15 కోట్ల గోల్‌­మాల్‌­పై రహస్యంగా విచారణ చేసి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

తాను ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్నందున.. విచారణ పూర్తికి మరికొంత గడువు కావాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కమి­షనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో విచారణ ప్రారంభించే అకాశం ఉంది.

దూకుడు తగ్గేలా చూడండి..
మరోవైపు 2018–19 మధ్య టీడీపీ హయాంలో దాదాపు రూ.4 కోట్లు ఉర్దూ అకాడమీ నిధులను 67 మంది వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిన వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2021లో సీఐడీ కేసు నమోదు చేసి.. నలుగురిని అరెస్టు చేసింది. ఐపీసీ సెక్షన్‌ 420, 409 రెడ్‌ విత్‌ 120(బి) కేసులో ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ మస్తాన్‌ వలీ (ప్రస్తుతం రిటైర్డ్‌), సూపరింటెండెంట్‌ జాఫర్‌ (ప్రస్తుతం తెలంగాణ ఉర్దూ అకాడమీలో పనిచేస్తున్నారు)లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్‌ అనంతరం బెయిల్‌పై వచ్చారు. 

తాజాగా ఏపీకి చెందిన ఉర్దూ అకాడమీ ఉద్యోగితో పాటు బయటి వ్యక్తిని సీఐడీ అరెస్టు చేసింది. మరో 11 మందిని సీఐడీ అరెస్టు చేస్తుందనే లీకులు ఇవ్వడంతో వారంతా టీడీపీ మైనార్టీ నేత మధ్యవర్తిత్వంతో ప్రభుత్వ పెద్దల శరణు కోరుతున్నారు. ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని కలవరపడుతున్నారు. 

సీఐడీ దూకుడుకు కళ్లెం వేసి తమను కాపాడాలని మంత్రిని కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, గత టీడీపీ హయాంలో ఉర్దూ అకాడమీని హద్దులేని అక్రమాలకు అడ్డాగా మార్చేశారని, రూ.30కోట్ల నిధులు ఎవరెవరు కొల్లగొట్టారో తేల్సాలని ముస్లిం సమాజం కోరుతోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)