Breaking News

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు

Published on Tue, 03/18/2025 - 05:42

సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొదటి లాంగ్వేజ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయ్‌రామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,27,277 మంది విద్యార్థులకు గాను 6,16,451 మంది(98.27 శాతం) హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా.. 1,545 కేంద్రాలను ఫ్లయింగ్‌ స్క్వాడ్లు తనిఖీ చేశాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను డిబార్‌ చేసినట్లు వెల్లడించారు.

కాంపోజిట్‌కు బదులు జనరల్‌ పేపర్‌ రాసిన విద్యార్థిని!
తెనాలిఅర్బన్‌ : పదో తరగతి పరీక్షల్లో అపశృతి దొర్లింది. కాంపోజిట్‌ తెలుగు పరీక్ష రాయాల్సిన విద్యార్థిని జనరల్‌ తెలుగు పేపరు రాసింది. విద్యాశాఖ అధికారుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని ఎన్‌ఎస్‌ఎస్‌ఎంహెచ్‌ స్కూ ల్లో  కే ధనశ్రీ ³దో తరగతి పరీక్షలు రాసేందుకు సోమవారం పాఠశాలకు వచ్చింది.

ఆమె కాంపోజిట్‌ తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా.. ఇన్విజిలేటర్‌ పొరపాటున జనరల్‌ తెలుగు పేపరు ఇచ్చారు. విద్యార్థిని కూడా సకాలంలో గుర్తించకుండా పరీక్ష రాసేసింది. చివరి సమయంలో గుర్తించి.. విషయాన్ని ఇన్విజిలేటర్‌కు తెలియజేసింది. అప్పటికే సమయం మించిపోవడంతో చేసేది లేక ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేసి.. రాసిన పేపరును పరిగణనలోకి తీసుకునేలా చూస్తామని ఇన్విజిలేటర్‌ చెప్పారు. దీనిపై విచారణ జరిపిన డీఈవో సీవీ రేణుక.. ఇన్విజిలేటర్‌ను సస్పెండ్‌ చేశారు. విద్యార్థికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని డీఈవో ప్రకటించారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)