Breaking News

క్యాన్సర్‌ను జయిస్తూ.. చదువులో రాణిస్తూ!

Published on Mon, 04/14/2025 - 09:54

గోనెగండ్ల: ఓ విద్యార్థిని క్యాన్సర్‌ను జయిస్తూ ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటింది. గోనెగండ్లకు చెందిన ఉరుకుందు గౌడ్, జానకి దంపతులకు కుమార్తె సృజనామృత, కుమారుడు భగీరథ్‌ గౌడ్‌లు ఉన్నారు. ఉరుకుందు ప్రస్తుతం కర్నూలు రెండో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కర్నూలులోనే నివాసం ఉంటున్నారు. గత ఏడాది సృజనామృత పదో తరగతి చదువుతుండగా క్యాన్సర్‌ వ్యాధి ఉన్నట్లు బయటపడింది. 

మహమ్మారితో పోరాడుతూనే చదువు కొనసాగిస్తోంది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఉదయం రాసి మధ్యాహ్నం నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందింది. పరీక్షల్లో ప్రతిభ చాటుతూ 493 మార్కులు సాధించింది. అప్పటి నుంచి క్యాన్సర్‌తో బాధపడుతూనే కర్నూలులో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంటర్‌ పరీక్షలు రాసింది. శనివారం విడుదలైన ఫలితాల్లో 420 మార్కులు సాధించింది. ఎంబీబీఎస్‌ సీటు సాధించి పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని సృజనామృత చెబుతోంది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)