Breaking News

దానా కదలికలను ట్రాక్‌ చేసిన ఇస్రో ఉపగ్రహాలు

Published on Fri, 10/25/2024 - 05:18

సూళ్లూరుపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను కదలికలను ఇస్రో ప్రయోగించిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈఓఎస్‌–06), ఇన్‌శాట్‌–3డీఆర్‌ ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాయని ఇస్రో తన అధికారిక వెబ్‌సైట్‌లో గురువారం తెలియజేసింది. 

2022 నవంబర్‌ 26న పీఎస్‌ఎల్‌వీ సీ–54 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన ఈఓఎస్‌–06, 2016 సెప్టెంబర్‌ 8న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–05 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన ఇన్‌శాట్‌–3డీఆర్‌ ఉపగ్రహాలు విపత్తులను ముందస్తుగా గుర్తించి మానవాళికి మేలు చేస్తుండటంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయనడానికి ఇదే నిలు­వెత్తు నిదర్శనం. ఈ నెల 20న బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సముద్రపు గాలి నమూనాలను బట్టి ఈఓఎస్‌–06 ఉపగ్రహం ముందస్తుగా గుర్తించింది.

మేఘాలను బట్టి ఇన్‌శాట్‌–3డీఆర్‌ ఉపగ్రహం ఈ తుపానును ముందస్తుగా గుర్తించింది. తు­పాను బెంగాల్, ఒడిశా మీదుగా వెళ్లి తీరం దాటింది. ఈ విషయాన్ని ఈ రెండు ఉపగ్రహాలు ముందస్తుగా ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్త­మై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి. దీనివల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటి­ల్లకుండా చర్యలు తీసుకునే అవకాశం చిక్కింది.

మోదీ అభినందనలు
ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన ఉపగ్రహాలు దేశానికి చేస్తున్న సేవలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ సందర్భంగా కొనియాడారు. వాటిని తయారు చేస్తున్న మన శాస్త్రవేత్తలు విపత్తులను ముందుగా గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించి.. దేశ ప్రగతిని కాపాడుతున్నారని ప్రధాని అభినందించారు.

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)