Breaking News

22న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల 

Published on Wed, 02/22/2023 - 06:00

తిరుమల: మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలున్నాయి.

మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లకు ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ నమోదు ప్రక్రియ 22న ఉదయం 10 గంటల నుంచి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్‌ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి సేవను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. 

సర్వ దర్శనానికి 10 గంటలు 
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. సోమ­వారం అర్ధరాత్రి వరకు 61,374 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.4.20 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు ఉన్నవారికి సకాలంలో, దర్శనం టికెట్లు లేనివారికి 10 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న వారికి 2 గంటల్లో దర్శనమవుతోంది.

కాగా, శ్రీవారిని మంగళవారం ఏపీ హోం మంత్రి తానేటి వనిత, ఇండియన్‌ క్రికెట్‌ క్రీడాకారుడు సూర్యకుమార్‌ యాదవ్, ఎంపీలు ప్రిన్సెస్‌ దియా కుమారి, శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. అలాగే, మంత్రి తానేటి వనిత కుటుంబ సభ్యులతో తిరుచానూరుకు వెళ్లి పద్మావతీ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)