గుట్టురట్టు కాకుండా అరుణ అరెస్ట్‌.. ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

Published on Thu, 08/21/2025 - 07:06

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: నెల్లూరు సెంట్రల్‌ జైల్లో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్‌ పెరోల్‌ వ్యవహారం గుట్టు రట్టు కాకుండా అత్యవసరంగా ఈ ఎపిసోడ్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టడంలో భాగంగా శ్రీకాంత్‌ సన్నిహితురాలు నిడిగంటి అరుణను ప్రభుత్వం ఆగమేఘాలపై అరెస్ట్‌ చేయించింది. కోవూ­రులో బిల్డర్‌ నుంచి అపార్ట్‌మెంట్‌ కొనుగోలు వ్యవ­హా­రంలో అరుణ.. శ్రీకాంత్‌ స్నేహితులను అడ్డుపె­ట్టు­కుని బలవంతంగా రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు ప్రయ­త్నించిందని మూడేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు కేసు నమోదు చేయించింది.

హైదరాబాద్‌కు వెళ్తున్న ఆమెను బాపట్ల జిల్లా అద్దంకిలో పోలీసులు అరెస్ట్‌ చేశా­రు. న్యా­యమూర్తి రిమాండ్‌ విధించడంతో ఒంగోలు జైలుకు తర­లించారు. అంతకు ముందు అరుణను అరెస్ట్‌ చేసిన పోలీ­సులు ఆమెను కారు డిక్కీలో వేశారు. ‘నన్ను అన్యాయంగా అరెస్ట్‌ చేస్తున్నారు. నా కారులో గంజాయి పెట్టాలని నా కారు డ్రైవర్‌కు చెబుతున్నారు. నన్ను అక్రమంగా నిర్బంధించారు. నాపై ఏమేమి కేసులు పెడుతున్నారు? నేను చేసిన తప్పేంటి? నన్ను చంపుతారేమోనని భయంగా ఉంది. మీడియా నన్ను కాపాడాలి’ అంటూ డిక్కీలోంచి సెల్ఫీ వీడియో తీసి బయటకు పంపింది. ఈ వీడియో వైరల్‌ కావడంతో ప్రభుత్వ పెద్దలు బెంబే­లెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెపై మరిన్ని కేసులు నమోదు చేసి.. ఇప్పుడప్పుడే బయటకు రాకుండా చేసేందుకు పోలీస్‌ శాఖ ప్రయత్నిస్తోంది.  

అవును.. సిఫార్సు లేఖ ఇచ్చాను 
జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్‌ పెరోల్‌కు తాను సిఫార్సు లేఖ ఇచ్చింది నిజమేనని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ బుధవారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న తన కు­మా­రుడిని చూడాలని ఉందంటూ తనకు ప్రజా విజ్ఞప్తు­ల్లో ఓ మహిళ వినతి పత్రం ఇచ్చారన్నారు. ఆ తర్వాత పెరోల్‌ రద్దు కావడం తెలిసిందేనని చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల తాను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన సమయంలో అక్కడ అరుణ అనే మహి­ళ ఉందని, దీనిని ఆసరాగా చేసుకుని పెరోల్‌కు తామే సహకరించినట్లు ఆరోపణలు చేయడం సబబు కాద­న్నారు. పెరోల్‌ రద్దుతో వివాదం సమసిపోయిందన్నారు.

రూ.2 కోట్లు ఎవరికి ఇచ్చినట్లు?
శ్రీకాంత్‌ 2014లో టీడీపీ హయాంలో జైలు నుంచి తప్పించుకుని నాలుగేళ్ల పాటు డాన్‌గా ఎదిగాడు. వంద మందికి పైగా రౌడీషీటర్లను సైనికుల్లా పెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేల సహకారంతో నెల్లూరులో సెటిల్‌మెంట్లు, దందాలు, హత్యాకాండలు సాగించాడు. నాలుగేళ్ల తర్వాత స్వచ్ఛందంగా లొంగిపోయాక కూడా అదే తరహాలో జైలు నుంచే అన్ని కార్యక్రమాలు నిర్వహించాడు. ఇవన్నీ తెలిసి కూడా కూటమి ప్రభుత్వం అతడికి పెరోల్‌ మంజూరు చేసి.. అతని నేరాలకు రాచబాట వేసింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పెరోల్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమను వాడుకుని వదిలేశారని, అందరి గుట్టు విప్పుతానని శ్రీకాంత్‌ సన్నిహితు­రాలు అరుణ పెట్టిన పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దీంతో పెరోల్‌ వెనుక అసలు గుట్టుతోపాటు అతని నేర చరిత్రలో భాగస్వాములుగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల అసలు రంగు బయట పడుతుందని ప్రభుత్వం బెంబేలెత్తిపోయి హడావుడిగా ఆమెను అరెస్ట్‌ చేయించింది. కాగా, పెరోల్‌ కోసం హోం శాఖలో ముఖ్యులొకరికి అరుణ రూ.2 కోట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకూ ఆ డబ్బును ఎవరు తీసుకున్నారో విచారణలో తేలుస్తారా?

ముగ్గురు ఏఆర్‌ కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌
జీవిత ఖైదీ శ్రీకాంత్‌ హాస్పిటల్‌లో ఉన్న సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఏఆర్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ జీ కృష్ణకాంత్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది డిసెంబర్‌లో శ్రీకాంత్‌ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చేరారు. నెల రోజులకు పైగా అయన హాస్పిటల్లో ఉన్నారు. ఆ సమయంలో సన్నిహితురాలు అరుణతో మసాజ్‌ చేయించుకుంటూ, డ్యాన్స్‌లు చేసిన వీడియోలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో దీనిపై విచారణ జరిపిన ఎస్పీ.. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఏఆర్‌ కానిస్టే­బుళ్లు సుబ్బారావు, ఖాజా మొహిద్దీన్, ఖలీల్‌ను విధుల నుంచి తొలగించారు. శ్రీకాంత్, అరుణ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు వారికి సహకరించారో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)