Breaking News

మహిళపై ఎస్‌ఐ దాష్టీకం

Published on Sat, 04/12/2025 - 04:49

రేణిగుంట: తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, పోలి భీమారం గ్రామానికి చెందిన ఓ మహిళపై రూరల్‌ ఎస్‌ఐ అభ్యంతరకర రీతిలో దాడికి పాల్పడిన సంఘటన ఇది. హత్యాయత్నం కేసు ఉందంటూ ఓ వ్యక్తి ఇంటికి వచ్చి ఎసై.. అతను పొలానికి వెళ్లడంతో అతని భార్యపై దాడికి దిగారు.  బాధితురాలి కథనం మేరకు..శుక్రవారం ఉదయం శ్రీకాళహస్తి రూరల్‌ ఎస్‌ఐ నరసింహారావు  సిబ్బందితో కలిసి భీమారం గ్రామానికి చెందిన చిన్నమనాయుడు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భార్య సంధ్య, కుమారుడు, కుమార్తె  ఉన్నారు. చిన్నమనాయుడు ఎక్కడ?, అతనిపై హత్యాయత్నం కేసు ఉంది, అరెస్ట్‌ చేయాలని గట్టిగా కేకలు వేశారు.

బూతులు తిడుతూ మాట్లాడాడు. దీంతో పొలం వద్దకు వెళ్లాడని, ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నారని సంధ్య ప్రశ్నించింది. విచక్షణ కోల్పోయిన ఎస్‌ఐ ఆమె జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి దాడి చేశారు. జాకెట్‌ చిరిగిపోయిందని, ఎంత ప్రాధేయపడుతున్నా వదలకుండా తాళిబొట్టు తెంచేశాడని సంధ్య కన్నీరుమున్నీరైంది. అధికార పార్టీ నేతల ఆదేశాలతో తనపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధితురాలు వాపోయింది. 

ఎవరిని చంపామో చెప్తే తమంతట తామే వచ్చి స్టేషన్‌లో లొంగిపోతామని వేడుకున్నా వినకుండా  దారుణంగా దాడి చేశారని బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తిని వివరణ కోరగా, హత్యాయత్నం  కేసుకు సంబంధించి కొంత కాలం నుంచి పిలుస్తున్నా చిన్నమనాయుడు స్పందించకపోవడంతో ఎస్‌ఐ గ్రామానికి వెళ్లారన్నారు.  ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)