Breaking News

38 మంది ఉపాధ్యాయుల అరెస్ట్‌

Published on Tue, 09/16/2025 - 05:01

పలాస: ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్‌ చేపట్టిన రణభేరి ప్రచార జాత పోలీసుల ఆంక్షలతో ఉద్రిక్తంగా మారింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద సోమవారం ర్యాలీ ప్రారంభమైంది. అప్పటికే కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు తన సిబ్బందితో అక్కడకు చేరుకొని ర్యాలీకి, నిరసన తెలపడానికి అనుమతి లేదని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగించడంతో పోలీసులు అరెస్టులకు తెగబడ్డారు.

యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిశోర్‌కుమార్, కోశాధికారి రెడ్డి మో­హనరావు, జిల్లా అధ్యక్షులు బాబూరావు, బి.శ్రీరామమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజాన దమయంతి, జిల్లా అద్యక్షులు గిరిధర్, జిల్లా నాయకులు రవికుమార్, కోదండరావు, బల్ల చిట్టిబాబు, కంచరాన రమేష్, ఎల్‌వీ.చలం, గున్న రమేష్‌ తదితర ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు మొత్తం 38 మందిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

మిగతా ఉపాధ్యాయులు కాశీబుగ్గ జెడ్పీ ఉన్నత పాఠశాల వద్దకు చేరుకొని అక్కడ నిరసన తెలిపారు. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో చే­పట్టిన రణభేరి జాతాను పోలీసులు అడ్డుకుని విఘాతం కలిగించడం సరికాదన్నారు. సోమవారం ప్రారంభమైన ఈ రణభేరి ప్రచార జాత కొనసాగుతోందని, సెపె్టంబరు 25న గుంటూరులో ముగుస్తుందని స్పష్టం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)