మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
మద్యం తాగి వచ్చాడు.. పెళ్లి బాజా మోగాల్సిన ఇంట..
Published on Thu, 08/19/2021 - 15:23
శ్రీకాకుళం: పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదం నెలకొంది. మద్యం తాగి వచ్చిన వ్యక్తిని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపంతో కలుపు నివారణ మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దమల్లిపురం గ్రామంలో చోటు చేసుకోగా.. ఏనుగుతల దుర్యోధనరావు (55) ప్రాణాలు కోల్పోయాడు. పాతపట్నం ఎస్సై మహమ్మద్ అమీర్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమల్లిపురం గ్రామానికి చెందిన దుర్యోధనరావు కుమారుడు గిరిబాబుకు ఈ నెల 20వ తేదీ వివాహం జరగాల్సి ఉంది.
అయితే ఆయన ఈ నెల 17వ తేదీన మద్యం తాగి ఇంటికి వచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు కల్పించు కొని పెళ్లి పనులు పూర్తి చేయకుండా మద్యం తాగి తిరగడం ఏమిటని దుర్యోధనరావును మందలించా రు. దీనికి మనస్తాపం చెందిన అతను పొలం గట్లపై గడ్డి నివారణ కోసం ఇంట్లో ఉంచిన మందును తాగా డు. కుటుంబసభ్యులు గమనించి ఆటోలో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుమారుడు గిరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Tags : 1