Breaking News

గిరిజన విద్యార్థిని బలవన్మరణం

Published on Sat, 08/01/2026 - 07:28

శ్రీకాకుళం: స్థానిక కేజీబీవీ టైప్‌–4 వసతి గృహంలో గురువారం రాత్రి సవర పూజ (16) అనే ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం దేవనాపురం గిరిజన పంచాయతీ పరిధి లక్కయ్యగూడ గిరిజన గ్రామానికి చెందిన సవర బిడ్డికయ్య, తుప్పమ్మ దంపతుల మూడో కుమార్తె అయిన పూజ కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజి లో మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. ఈ నెల 16నే హాస్టల్‌లో చేరింది. 

శుక్రవారం వేకువజామున స్టడీ అవర్స్‌ కోసం విద్యార్థులను నైట్‌ టీచర్‌ నిద్ర లేపుతుండగా పక్క గదిలో పూజ ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే ఆమె మెట్రిన్‌ క్రాంతికి, హెచ్‌ఎం ఎ.గోవిందరావు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. విద్యారి్థని తల్లిదండ్రులతో పాటు పోలీసులకు విషయం తెలియడంతో ఎస్‌ఐ కె.వెంకటేష్‌ సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. వివరాలు సేకరించి తండ్రి బిడ్డికయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. 

ఈ నెల 28న బిడ్డికయ్య హాస్టల్‌కు వచ్చి విద్యార్థినికి ఖర్చుల కోసం రూ.900 ఇచ్చారు. ఆ సందర్భంలో పూజ తనకు ఇంగ్లిష్‌ చదువులు అర్థం కావడం లేదని, హాస్టల్‌ నచ్చడం లేదని చెప్పింది. కానీ తండ్రి ఆమెకు నచ్చజెప్పి వచ్చేశారు. ఇప్పు డు విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో తమ బిడ్డ అంత పిరికిది కాదని కుటుంబ సభ్యు లు అంటున్నారు. మృతిపై సమగ్ర విచారణ జరిపించాల ని కోరుతున్నారు. గురువారం రాత్రి 9.30, అర్ధరాత్రి 12 గంటలు వరకు ఇద్దరు విద్యార్థినుల బర్త్‌డే జరుపుకున్నారని, పూజ అంతవరకు ఉందని అక్క డి వారు చెప్పారు. పూజ విజయనగరం జిల్లా రాజాంలో ఇదివరకు చదివింది. అక్కడ నీరు వల్ల దురదలు రావడంతో తండ్రి కొత్తూరులో జాయిన్‌ చేశారు. అయితే సంఘటన స్థలం వద్ద ఓ లేఖ దొరి కినట్లు సమాచారం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు దహ న ఖర్చులను అలాగే హెచ్‌ఎం గోవిందరావు మరో రూ.ఐదు వేలును అందజేశారు. 

హాస్టల్‌ ఖాళీ 
విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో హాస్టల్‌లో ఉన్న విద్యార్థులంతా భయపడ్డారు. దాదాపు 90 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో హాస్టల్‌ ఖాళీ అయిపోయింది. టెక్కలి డిప్యూటీ డీఈఓ పి. విలయమ్, సర్వ శిక్ష అభియాన్‌కు చెందిన జీసీడీపీఓలు సందర్శించి విద్యార్థి మృతి పై వివరాలు తెలుసుకున్నారు. తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులను పంపించామని హెచ్‌ఎం తెలిపారు.      

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)