Breaking News

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా శ్రీదేవి

Published on Tue, 08/26/2025 - 04:53

భీమునిపట్నం: విశాఖ జిల్లా భీమిలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని తిరుమల శ్రీదేవి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. 24 సంవత్సరాలుగా బోధన వృత్తిలో ఉన్న ఆమె నాలుగేళ్లుగా ఇక్కడ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ‘కం టు లెర్న్‌ అండ్‌ గో టు సర్విస్‌ నేషన్‌’ అనే విధానంతో ఆమె విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ఆధునిక బోధన విధానంలో డిజిటల్‌ బోర్డు వినియోగంతోపాటు ఆయా పాఠ్యాంశాలను ప్రాక్టికల్‌గా వివరిస్తూ, వాటిపై పూర్తిస్థాయి అవగాహన కలి్పస్తున్నారు.

విద్యార్థులతో పలు అంశాలపై ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేయిస్తారు. దీనివల్ల పాఠ్యాంశాలు బాగా అర్థమై విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. 2015లో 8వ తరగతి విద్యార్థులు వర్షం నీటితో భూగర్భ జలాలను ఎలా పెంచాలనే అంశంపై రూపొందించిన ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ఐదో స్థానం లభించింది. అలాగే గూగుల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది. వినూత్న పద్ధతుల్లో బోధన, దాని ఫలితాలు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపిక చేసింది. ఇప్పుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. అవార్డును సెప్టెంబర్‌  5వ తేదీ ఢిల్లీలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు.  

విద్యార్థులకు మేలు  
మారుతున్న విద్యావిధానాలు, సాంకేతిక పద్ధతులకు అనుగుణంగా విద్యార్థులకు బోధించడం ద్వారా వారిలో మంచి ఆలోచన విధానం ఏర్పడటంతోపాటు ప్రతిభ కూడా తెలుస్తుంది. దీనివల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం కాకుండా భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. – తిరుమల శ్రీదేవి, ప్రధానోపాధ్యాయిని, భీమిలి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)