Breaking News

శోభాయమానంగా ఇంద్రకీలాద్రి

Published on Thu, 10/03/2024 - 05:07

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో దసరాను పురస్కరించుకుని శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం(3వ తేదీ) నుంచి ఈ నెల 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్స­వాల్లో అమ్మ­వారి దర్శనం ఉదయం 3–4 గంటల మధ్యలో ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. 

దర్శనానికి ఈ ఏడాది సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ఆలయ అధికారుల అంచనా. మూలానక్షత్రం రోజు సరస్వతి అలంకారంలో అమ్మవారిని 2.5 లక్షల మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉంది. 5 క్యూలైన్‌ల ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తులకు రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్న ప్రసాదం అందిస్తారు. 

క్యూలైన్‌లో భక్తులకు వాటర్‌ ప్యాకెట్లతో పాటు, చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్‌లు పంపిణీ చేస్తారు. భక్తుల కోసం 25 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. ఆలయ పరిసరాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. 12న విజయ దశమిని పురస్కరించుకుని సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. 

ఉత్సవాల నిర్వహణలో పాల్గొనే అన్ని శాఖల అధికారులతో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

నేడు శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో తొలి రోజైన గురువారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ  శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శ­నమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వి­తమైనది.  శ్రీబాలా మంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి ముఖ్యమైనది. విద్యో­పాసకులకు మొట్టమొదటిగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)