Breaking News

నేటి నుంచి దేవీ శరన్నవరాత్రులు

Published on Sun, 10/15/2023 - 04:55

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ):  దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నందు ఆదివారం నుంచి దేవీ శరన్నవరాత్రులు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేయనున్నారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

భక్తుల రద్దీని అంచనా వేసేందుకు పోలీస్, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం నిరంతరం ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం శనివారం నాటికి మూడు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసింది. దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం సాయంత్రం పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనం త్వరితగతిన అయ్యేలా చూడాలని ఆలయ ఈవో కెఎస్‌ రామారావు, ఫెస్టివల్‌ ఆఫీసర్‌ ఆజాద్‌కు పలు సూచనలు చేశారు. 

నేడు శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకారం 
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను తొలిరోజు ఆదివారం శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వి తమైనది. శ్రీ బాలామంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి గొప్ప­ది, ముఖ్యమైనది. శ్రీవిద్యోపాసకులకు మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీబాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీబాలా త్రిపురసుందరీదేవి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)